Advertisementt

సుధీర్ చిత్ర టైటిల్, ట్రైల‌ర్ చాలా బాగున్నాయి: కృష్ణ!

Fri 01st Jun 2018 01:17 PM
krishna,super star,sudheer babu,sammohanam trailer,sammohanam movie  సుధీర్ చిత్ర టైటిల్, ట్రైల‌ర్ చాలా బాగున్నాయి: కృష్ణ!
Super Star Krishna Launches Sammohanam Trailer సుధీర్ చిత్ర టైటిల్, ట్రైల‌ర్ చాలా బాగున్నాయి: కృష్ణ!
Advertisement
Ads by CJ

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా... ఆయ‌న చేతుల మీదుగా 'స‌మ్మోహ‌నం' ట్రైల‌ర్ విడుద‌ల‌

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా నేడు (గురువారం)  ఆయ‌న చేతుల‌ మీదుగా 'స‌మ్మోహ‌నం' ట్రైల‌ర్ విడుద‌లైంది. సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం 'స‌మ్మోహ‌నం'. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన 'స‌మ్మోహ‌నం' జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

'స‌మ్మోహ‌నం' ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. 'స‌మ్మోహ‌నం' టైటిల్ చాలా బావుంది. శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌గారు తీసిన 'ఆదిత్య 369' చాలా గొప్ప సినిమా.'స‌మ్మోహ‌నం'లో  ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ చాలా బావున్నాయి. 'స‌మ్మోహ‌నం' ట్రైల‌ర్ చూస్తుంటే పెద్ద హిట్ అవుతుంద‌ని అనిపిస్తోంది. సుధీర్ ఇదివ‌ర‌కు సినిమాల‌క‌న్నా ఈ సినిమాలో చాలా బావున్నాడు. ట్రైల‌ర్ చాలా ఇంప్ర‌సివ్‌గా ఉంది. ఈ పిక్చ‌ర్ సూప‌ర్‌ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నా. ప్రేక్ష‌కుల‌కు ఆనందం క‌లిగిస్తుంద‌ని భావిస్తున్నా. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటిగారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ‌త చిత్రాల‌న్నీ స‌క్సెస్‌ఫుల్ సినిమాలే. ఈ సినిమా కూడా వాటిని మించి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా.. అని అన్నారు. 

నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. రామారావుగారి అభిమానులైనా, నాగేశ్వ‌ర‌రావుగారి అభిమానులైనా, మ‌రే హీరో అభిమానులైనా.. అంద‌రూ కృష్ణ‌గారి అభిమానులే. కృఫ్ణ‌గారి సినిమాలు చూస్తూ మేమంద‌రం పెరిగాం. ఆయ‌న్ని అంత‌గా ప్రేమించేవాళ్లం. అలాంటి సూప‌ర్‌స్టార్ కృష్ణగారి పుట్టిన‌రోజున మా ట్రైల‌ర్‌ని ఆయ‌నే విడుద‌ల చేయ‌డం మా అదృష్టం. వెరీ వెరీ హ్యాపీ క్ష‌ణాలివి.  చ‌ల్ల‌ని చేతుల‌తో కృష్ణ‌గారు మాకు ఆశీర్వాదం అందించారు. మేం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌బోతున్నాం.. అని అన్నారు.

హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ముందుగా మావ‌య్య‌గారు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారికి  వెరీ వెరీ హ్యాపీ బ‌ర్త్ డే. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా చిత్రం 'స‌మ్మోహ‌నం' ట్రైల‌ర్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. మావ‌య్య‌గారికి ట్రైల‌ర్ చాలా బాగా న‌చ్చింది. టీజ‌ర్ ఎలాగైతే ప్రేక్ష‌కులు అంద‌రికీ న‌చ్చిందో, ట్రైల‌ర్ కూడా అలాగే త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. జూన్ 15న సినిమా విడుద‌ల‌వుతుంది.. అని అన్నారు. 

దర్శకుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ.. చిన్న‌ప్ప‌టి నుంచి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారి సినిమాలు చూస్తూ, తీవ్రంగా అభిమానిస్తూ పెరిగాను. ఆయ‌న చేతుల మీదుగా మా 'స‌మ్మోహ‌నం' సినిమా ట్రైల‌ర్ ఇవాళ ఆవిష్కృత‌మైంది. ఇంత‌కంటే శుభ‌సూచికం ఉండ‌ద‌ని అనుకుంటున్నా. మా 'స‌మ్మోహ‌నం' ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఉంటుంది. క‌థ‌లో అంద‌మైన రొమాన్స్ తో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యం మిళిత‌మై ఉంటుంది. అర్థ‌వంత‌మైన పాత్ర‌లుంటాయి. ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. నేను తీసిన సినిమాల్లో నాకు చాలా న‌చ్చిన సినిమా. నేను మ‌రింత‌గా ప్రేమించి తీసిన సినిమా. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధీర్ చాలా కొత్త‌గా ఉంటాడు. అత్యుత్త‌మ‌ స్థాయి న‌ట‌న‌ను సుధీర్ చూపించ‌గ‌ల‌ర‌నడానికి మా చిత్రం ఓ ఉదాహ‌ర‌ణ‌. నాయిక‌ అదితీరావు హైద‌రీ అద్భుతంగా చేశారు. న‌రేశ్ స్పెష‌ల్ పాత్ర‌లో చేశారు. ప‌విత్ర లోకేష్‌, హ‌ర్షిణి, రాహుల్ రామ‌కృష్ణ... ఇలా అంద‌రూ క‌లిసి చాలా బాగా చేశారు. అద్భుత‌మైన ప్ర‌తిభ ఉన్న న‌టీన‌టులు ఒక‌చోట క‌లిస్తే ఎంత బావుంటుందో ఈ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌. మేం ఎంత‌గానో ప్రేమించి తీసిన ఈ సినిమా మేం ఎంత‌గానో ప్రేమించే కృష్ణ‌గారి చేతుల మీదుగా విడుద‌ల కావ‌డం నాకు చాలా ఆనంద‌గానూ, గ‌ర్వంగానూ ఉంది. జూన్ 15న 'స‌మ్మోహ‌నం' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నా గ‌త చిత్రాల్లాగానే ఈ సినిమాను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది.. అని చెప్పారు. 

Super Star Krishna Launches Sammohanam Trailer:

Super Star Birthday Special: Sammohanam Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ