Advertisementt

వర్మ తన్నమని లెటర్ రాశాడు: నాగ్!

Wed 30th May 2018 12:38 PM
officer,pre release event,highlights,nagarjuna,rgv  వర్మ తన్నమని లెటర్ రాశాడు: నాగ్!
RGV Asked Me to Kick Him: Nagarjuna వర్మ తన్నమని లెటర్ రాశాడు: నాగ్!
Advertisement
Ads by CJ

రాంగోపాల్ వర్మ చిత్తశుద్ధితో చేసిన సినిమా 'ఆఫీసర్': అక్కినేని నాగార్జున 

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. 'అంతం, గోవిందా గోవిందా' చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో 'ఆఫీసర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయడం మరో విశేషం. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైద్రాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సుమంత్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, ఎం.ఎం.కీరవాణి, వై.వి.ఎస్.చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఆఫీస‌ర్ గురించి మాట్లాడే ముందు శివ గురించి మాట్లాడాలి. శివ ముందు త‌ర్వాత తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ.. శివ త‌ర్వాత తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అని అంటుంటారు. శివ వ‌ర్మ‌కు బ్రేక్ ఇస్తే.. నాకు అమ‌ల‌ను ఇచ్చింది. ఆఫీస‌ర్ సినిమా కోసం ఎంతో మంది క‌ష్ట‌ప‌డ్డారు. యువ‌కుల‌తో క‌లిసి ప‌నిచేస్తుంటే ముచ్చ‌టేసింది. ఇంత మంచి యంగ్ టీంతో సినిమా చేసిన వ‌ర్మ‌కు థాంక్స్‌. సినిమా షూటింగ్ స‌మ‌యంలో చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింది. ఈ క‌థ చెప్పిన‌ప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. దేశానికి సేవ చేసే ఓ పోలీస్ ఆఫీస‌ర్‌.. న‌మ్మిన నిజం కోసం పోరాడే వ్య‌క్తి అని చెప్పిన‌ప్పుడు ఆ క్యారెక్ట‌ర్‌ చాలా న‌చ్చింది. ఈ సినిమా చేసే స‌మ‌యంలో 'ఒక‌వేళ నేను చెప్పింది చేయ‌క‌పోతే.. ఎక్క‌డో త‌న్న‌మ‌ని' కూడా వ‌ర్మ లెట‌ర్ రాశాడు. త‌న‌ని నేను త‌న్న‌ను. వ‌ర్మ ఒక చిత్త‌శుద్ధితో చేశాడు. శివ రిలీజైన‌ప్పుడు అంద‌రూ సౌండ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ త‌ర్వాత మ‌రో సినిమా గురించి ఎవ‌రూ మాట్లాడ‌లేదు. ఈ ఆఫీస‌ర్ సినిమాలో అంత మంచి సౌండింగ్ ఉంది. అది గుండెను తాకేలా ఉంటుంది. అలాగే బ్రూట‌ల్ యాక్ష‌న్ సీన్స్ ఉంటాయి. చివ‌రి 20 నిమిషాలుండే యాక్ష‌న్ సీన్స్ అవుట్ స్టాండింగ్‌గా ఉంటాయి. హాలీవుడ్ రేంజ్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్‌లుంటాయి. రాముతో క‌లిసి మ‌ళ్లీ ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల త‌ర్వాత రియ‌ల్ ఇన్‌టెన్స్ యాక్ష‌న్ ఫిలిం రాబోతుంది.. అన్నారు.

రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ.. నేను క్రైమ్ డ్రామాలు, రౌడీయిజం, యాక్ష‌న్ ఫిలింస్ ఇష్ట‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం. నేను చ‌దువుకునే రోజుల్లో వెనుక బెంచీల్లో కూర్చుని చాక్ పీసులు విసేరేవాళ్ల‌ను ఎక్కువ‌గా చూశాను. అటువంటి వారితో..ముందు బెంచీల వాళ్ల జుట్లు లాగా వాళ్ల‌తో స్నేహం చేశాను. త‌ర్వాత స్ట్రీట్ గ్యాంగ‌ర్స్‌ను హీరోలుగా చూడ‌టం మొద‌లు పెట్టాను. దాని త‌ర్వాత గ్యాంగ్ స్ట‌ర్స్‌, ఫ్యాక్ష‌నిస్ట్‌లంద‌రిని హీరోలుగా చూడటం మొద‌లు పెట్టాను. అంద‌రూ అయిపోయిన త‌ర్వాత ఆలోచించి పోలీస్ ఆఫీస‌ర్స్ వైపు దృష్టి సారించాను. క్రిమిన‌ల్స్ నుండి సోసైటీని కాపాడ‌టం పోలీస్ ఆఫీస‌ర్స్ వృత్తి. ముంబైలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ చెప్పిన పాయింట్‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌గానే నా మైండ్‌లో నాగార్జున మెదిలాడు. శివ త‌ర్వాత నేను ఇంత వ‌ర‌కు హీరోయిజం ఉన్న సినిమా చేయ‌లేదు. న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారితోనైనా పోరాడేవాడు.. రిస్క్ తీసుకునేవాడే హీరో. ఆఫీస‌ర్‌లో నాగార్జున క్యారెక్ట‌ర్‌లో కొత్త‌ద‌నాన్ని ప్రేక్ష‌కులు ఫీల‌వుతారు. నేను ఏ మంచి చేయ‌క‌పోయినా.. నా లైఫ్‌లో నాగార్జున అనేవాడు నాకు దొరికాడు. అంటే గ‌త జ‌న్మ‌లో ఏమైనా మంచి ప‌నులు చేసుండ‌వ‌చ్చు. సాధార‌ణంగా నేను ఎమోష‌న‌ల్‌గా ఫీల్ కాను. నాకు శివ‌తో నాగార్జున బ్రేక్ ఇచ్చాడు. నాగార్జున ఓ స్టీరింగ్ వీల్‌లా త‌యార‌య్యాడు. ఆఫీస‌ర్స్ సినిమా నాకు స్పెష‌ల్ మూవీ. ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ టేస్ట్స్ ఉంటాయి. నాగార్జున‌లో చూడాల‌నుకున్న అల్టిమేట్ హీరోయిజం తెర‌కెక్కించాను. ఈ ముప్పై ఏళ్ల‌లో ఎన్నో సినిమాలు చేసి ఉండ‌వ‌చ్చు. ఈ ప్ర‌యాణంలో ఎన్నో గొప్ప విల‌న్స్‌ను క్రియేట్ చేసి ఉండ‌వ‌చ్చు. వారిని నిర్మూలించే విధంగా నాగార్జున క్యారెక్ట‌ర్‌ను త‌యారు చేశాను. ఓ హిట్ ఫిలింకు చాలా మంది కార‌ణాలుంటే.. ప్లాప్ అయితే అందుకు ద‌ర్శ‌కుడే కార‌ణం అవుతాడు. ఆఫీస‌ర్‌ను నేను ఎంత బాగా క్రియేట్ చేసినా.. నాగార్జున పెర్‌పార్మెన్స్‌లోని క‌న్‌సిస్‌టెన్సీ.. ఎక్స్‌ప్రెష‌న్‌లో ప్రాణం పోశాడు. నేను అనుకున్న క్యారెక్ట‌ర్‌ను తెర‌పై చూసుకున్న త‌ర్వాత హ్యాపీగా ఫీల‌య్యాను. అందుకు నాగార్జున‌కి థాంక్స్‌. ద‌ర్శ‌కుడిగా, వ్య‌క్తిగా న‌న్ను నేను వెతుక్కున్నానంటే నాగార్జునకే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.. అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. శివ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇదే తరహాలో వర్క్ చేశారట నాన్న & వర్మ. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో 'ఆఫీసర్' కోసం చాలా కష్టపడి వర్క్ చేశారు. వాళ్ళు ఈ సినిమాలో చూపించే ప్రతి సౌండ్ కి ఆడియన్స్ రీసౌండ్ ఇస్తారు. నన్ను నాన్న ఎప్పుడూ నాన్నకంటే ఎక్కువగా ఒక అన్నయ్యలా చూసుకొనేవారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను.. అన్నారు. 

ఎం.ఎం.కీర‌వాణి మాట్లాడుతూ.. రాముగారితో ముప్పై ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నాగార్జున‌గారితో వ‌ర్మ చేసిన శివకి కూడా న‌న్నే మ్యూజిక్ చేయ‌మ‌న్నారు. అయితే నాగార్జున‌గారు కొత్త అబ్బాయి క‌దా! త‌ర్వాత చూద్దాం లే! అన్నారు. ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌రో శివ తీస్తే..నాతో మ్యూజిక్ చేయించుకుంటార‌ని భావిస్తున్నాను. వ‌ర్మ‌గారికి ఆల్ ది బెస్ట్‌.. అన్నారు.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. పాతికేళ్ల ముందు నాన్న‌గారు, వ‌ర్మ‌గారు ఎంత హార్డ్‌వ‌ర్క్ చేశారో.. ఈ సినిమాకు కూడా అలాగే చేశారు. మా యంగ్ జ‌న‌రేష‌న్ వారిని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకోవాలి. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌.. అన్నారు.

మైరా స‌రీన్ మాట్లాడుతూ.. నాగార్జున‌గారితో, రామ్‌గోపాల్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది.. అద్భుత‌మైన ఎక్స్‌పీరియెన్స్‌. ప్రేక్ష‌కులు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను.. అన్నారు.

RGV Asked Me to Kick Him: Nagarjuna:

Officer Pre Release Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ