శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయి కుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం ఆదివారం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభం అయ్యింది.
వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. కెమెరా స్విచ్ డీసీపీ. కృష్ణ మోహన్ చెయ్యడం జరిగింది. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నాగ శౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ పాల్గొన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ... డైరెక్టర్ నాకు 3 గంటలు నెరేషన్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టొరీ ఇది. మంచి ఆర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. త్వరలో హీరోయిన్ పేరు ప్రకటిస్తాము. ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాను. నాకు కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను.
దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ... క్లాప్ వంశి పైడిపల్లి చెయ్యడం జరిగింది. మంచి లవ్ స్టొరీ తో వస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా చెయ్యడానికి మాకు సహకరిస్తున్న సాయి కుమార్ గారికి, హీరో ఆదికి, నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాము. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
నిర్మాత చావలి రామాంజనేయులు మాట్లాడుతూ... సీమశాస్త్రి సినిమా తరువాత మేము ఈ సినిమా చేస్తున్నాము. బౌండెడ్ స్క్రిప్ట్ తో డైరెక్టర్ మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.
ఆర్టిస్ట్స్: ఆది, రావు రమేష్, రాధికా, అజయ్, మిర్చి కిరణ్, ప్రియా, రాజీవ్ కనకాల
టెక్నీషియన్స్: కెమెరామెన్: సాంబ బీమావరపు, మ్యూజిక్: అరుణ్ చిలువేరు, ఎడిటర్: ఉద్ధవ్, ఆర్ట్ డైరెక్టర్: టి.రాజ్ కుమార్, ఫైట్ మాస్టర్: రియల్ సతీష్, డైలాగ్స్: సురేంద్ర కృష్ణ, పడాల శివ సుబ్రహ్మణ్యం, ప్రజెంట్స్: డి.ఆర్.పీ. వర్మ, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు.నడికట్ల