సెన్సార్ పూర్తి చేసుకున్న నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా `నా నువ్వే`... జూన్ 14న విడుదల
డైనమిక్ హీరో నందమూరి కల్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ `నా నువ్వే`. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేశ్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి మాట్లాడుతూ - `మా `నా నువ్వే` చిత్రాన్ని జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఫ్రెష్ లుక్ లవ్‌స్టోరీ. జయేంద్రగారు సినిమాను అద్భుతమైన ఫీల్‌తో తెరకెక్కిస్తే.. పి.సి.శ్రీరామ్ గారు ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. ఇప్పటి వరకు నందమూరి కల్యాణ్ రామ్ చేయనటువంటి రొమాంటిక్ జోనర్ చిత్రమిది. కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్‌లో ప్రెజెంట్ చేసే చిత్రమిది. ఇద్దరినీ ఓ కొత్త మేకోవర్‌లో చూస్తారు. శరత్ సంగీతం అందించిన పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తోంది. హృదయాన్ని హత్తుకునే క్యూట్ అండ్ బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ మా `నా నువ్వే` చిత్రం` అన్నారు.
ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్, ఎడిటింగ్: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర.