Advertisementt

చిరంజీవి చిన్నల్లుడు 'విజేత'!

Wed 23rd May 2018 11:16 PM
chiranjeevi,son in law,kalyan dhev,movie title,vijetha  చిరంజీవి చిన్నల్లుడు 'విజేత'!
Vijetha as Title of Kalyan Dhev's Debut Film చిరంజీవి చిన్నల్లుడు 'విజేత'!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న తొలి చిత్రానికి 'విజేత' టైటిల్ ఖ‌రారు చేశారు. 1985లో చిరంజీవి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్ తో ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. 'లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అద‌ర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ స‌క్సెస్' అనేది ట్యాగ్ లైన్. అంటే ఇత‌రుల మొహాల్లో వెలుగు చూడ‌టం కూడా విజ‌య‌మే అని అర్థం. అందుకే క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఈ చిత్రానికి 'విజేత' అనే టైటిల్ పెట్టారు. సాయి కొర్ర‌పాటి వారాహి  సంస్థ‌లో ర‌జినీ కొర్ర‌పాటి నిర్మాత‌గా విజేత వ‌స్తుంది. రాకేశ్ శశి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ మ‌ధ్యే డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెట్టారు హీరో క‌ళ్యాణ్ దేవ్. బాహుబ‌లి ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌టం విశేషం. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ విజేత‌.

ఈ చిత్రంలో క‌ళ్యాణ్ దేవ్ తో పాటు మాళ‌విక న‌య్య‌ర్, నాజ‌ర్, త‌ణికెళ్ళ భ‌ర‌ణి, ముర‌ళిశ‌ర్మ‌, స‌త్యం రాజేష్, ప్ర‌గ‌తి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్, పోసాని, రాజీవ్ క‌న‌కాల‌, జ‌య‌ప్ర‌కాశ్(త‌మిళ్), ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, నియోల్ సీన్, కిరీటి, భ‌ద్రం, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: రాకేశ్ శ‌శి, నిర్మాత‌: ర‌జినీ కొర్ర‌పాటి (సాయి కొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్), స‌మ‌ర్ప‌ణ‌: సాయి శివాణి, సినిమాటోగ్ర‌ఫీ: కేకే సెంథిల్ కుమార్, సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్, ఎడిటింగ్: కార్తిక శ్రీ‌నివాస్, లిరిక్స్: రెహ‌మాన్, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, ఆర్ట్ డైరెక్ట‌ర్: రామ‌కృష్ణ‌, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Vijetha as Title of Kalyan Dhev's Debut Film:

Title Fixed for Chiranjeevi Son In Law Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ