Advertisementt

అభిమన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్ !

Tue 22nd May 2018 02:20 PM
vishal,abhimanyudu,june 1,updates  అభిమన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్ !
Abhimanyudu Movie Release Date Confirmed అభిమన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్ !
Advertisement
Ads by CJ

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్‌ 1న 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - 'తమిళ్‌లో 'ఇరుంబుతెరై' సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అయింది. 'అభిమన్యుడు' చిత్రానికి ఆంధ్రపద్రేశ్‌, తెలంగాణాల్లో కూడా తమిళ్‌లాగే ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుందని, తెలుగులో కూడా నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు. 

హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ 'జూన్‌ 1న మా 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మే 25న ఆడియో ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. తమిళ్‌లో ఇటీవల విడుదలైన 'ఇరుంబుతెరై' చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా విశాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చితంగా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం తమిళ్‌ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు. 

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

Abhimanyudu Movie Release Date Confirmed:

Vishal Abhimanyudu Movie Realease on june 1

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ