కొన్ని వారాల క్రితం విడుదలైన 'నేల టిక్కెట్టు' టీజర్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ క్లాస్ మరియు మాస్ అంశాలతో పాటూ అంతర్లీనంగా ఒక మంచి సందేశాన్ని చూపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆడియో పాటల్లోని సాహిత్యం ఈ సినిమాలో కేవలం వాణిజ్య, వినోద అంశాలే కాకుండా కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే హృద్యమైన అంశాలు కూడా ఉన్నాయని సూచించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో మానవ సంబంధాలు మరియు సమాజం గురించి అద్భుతమైన డైలాగులతో ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరించే పూర్తి ప్యాకేజీ అని నిరూపించింది.
రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ మరియు భావోద్వేగాలతో ఈ సినిమా మే 25న ప్రపంచవ్యాప్తంగా 4కె రెజల్యూషన్లో విడుదల అవ్వబోతుంది. ఈ చిత్ర విడుదల హక్కులను గేట్‌వే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కొనుగోలు చేసింది. భారత్‌లోనే కాక అమెరికాలో కూడా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు.