Advertisementt

'పడి పడి లేచే మనసు'లో సునీల్..!

Sun 20th May 2018 05:16 PM
sharwanand,sunil,padi padi leche manasu  'పడి పడి లేచే మనసు'లో సునీల్..!
Sunil in Sharwanand Movie 'పడి పడి లేచే మనసు'లో సునీల్..!
Advertisement
Ads by CJ

శర్వానంద్ కథానాయకుడిగా, సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న చిత్రం 'పడి పడి లేచే మనసు'. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' వంటి సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ & క్రియేటివ్  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలుస్తున్నారు. ఇటీవలే విడుదలైన శర్వానంద్, సాయి పల్లవిల ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది. 

ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. కామెడీ హీరో సునిల్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు. నేటి నుండి షూటింగ్ లో పాల్గొంటారు. శర్వానంద్, సాయి పల్లవి, సునిల్ మరియు వెన్నెల కిషోర్ ల పై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. 

శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. 

Sunil in Sharwanand Movie:

Sunil to play key role in Sharwanand’s Padi Padi Leche Manasu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ