Advertisementt

'నా నువ్వే' ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్!

Sat 19th May 2018 06:14 PM
naa nuvve trailer,kalyan ram,naa nuvve movie,tamannah  'నా నువ్వే' ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్!
Naa Nuvve Ready to Release 'నా నువ్వే' ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్!
Advertisement
Ads by CJ

భారీ అంచనాల న‌డుమ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న 'నా నువ్వే'

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా రూపుదిద్దుకున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం 'నా నువ్వే'. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ నెలలోనే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.  రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్‌ను 7.2 మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ట్రైల‌ర్ ట్రెండింగ్‌లో ఉంది. 

స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతున్న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ముందుగా అనుకున్నారు. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ జోడి హిట్ పెయిర్‌గా అదిరిపోయారని అంతా అనుకుంటున్నారు.  

Naa Nuvve Ready to Release:

Tremendous Response to Naa Nuvve Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ