Advertisementt

'జంబ‌ల‌కిడి పంబ‌' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Fri 18th May 2018 01:00 PM
srinivasa reddy,jambalakidi pamba movie,release date,june 14  'జంబ‌ల‌కిడి పంబ‌' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Jambalakidi Pamba Release Date Fix 'జంబ‌ల‌కిడి పంబ‌' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

జూన్ 14న విడుదలకు సిద్దమౌతున్న 'జంబ‌ల‌కిడి పంబ‌' 

'జంబ‌ల‌కిడి పంబ‌' అనే పేరు విన‌గానే సీనియ‌ర్ న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో  మ‌రో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. 'గీతాంజ‌లి, జ‌య‌మ్మునిశ్చ‌య‌మ్మురా, ఆనందో బ్రహ్మ' వంటి వైవిధ్య‌మున్న చిత్రాల‌తో హీరోగా మెప్పించిన శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.  సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. ఈ సినిమా జూన్ 14న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 

ఈ సంద‌ర్బంగా చిత్ర నిర్మాత‌లు ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ మాట్లాడుతూ.. 'మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న 'జంబ‌ల‌కిడి పంబ‌'తో ప్రేక్ష‌కులు మ‌రోసారి లాఫింగ్ రైడ్ చేయ‌నున్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. నేటితో షూటింగ్ పూర్త‌య్యింది. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు స‌మాంత‌రంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అందులో భాగంగా రీరికార్డింగ్ ప‌నులు నేటి నుండి జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అన్నారు. 

ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీకృష్ణ మాట్లాడుతూ... 'ఈవీవీగారు తెర‌కెక్కించిన జంబ‌ల‌కిడి పంబ చిత్రాన్ని ప్రేక్ష‌కులు మ‌ర‌చిపోలేదంటే కార‌ణం అందులోని కామెడీయే. మ‌రోసారి క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీతో అదే టైటిల్‌తో జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. బాడీ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ వ‌ల్ల హీరో హీరోయిన్స్ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటారనేదే సినిమా. అయితే దీని వ‌ల్ల జ‌న‌రేట్ అయ్యే కామెడీ ప్రేక్ష‌కుల‌ను ఆద్యంతం న‌వ్విస్తుంది. మ్యూజిక్‌కు చాలా మంచి స్కోప్ ఉన్న చిత్రం. అందుకు త‌గ్గ‌ట్లు గోపీసుంద‌ర్‌గారు ఐదు అద్భుత‌మైన ట్యూన్స్‌ను అందించారు. శ్రీనివాస‌రెడ్డిగారు, సిద్ధి ఇద్నాని, పోసాని, వెన్నెల‌కిశోర్ ఇలా ప్ర‌తీ పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది' అన్నారు. 

న‌టీన‌టులు: స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.  

సాంకేతిక నిపుణులు: సంగీతం:  గోపీసుంద‌ర్‌,  కెమెరా:  స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్:  రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌:  బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌. 

Jambalakidi Pamba Release Date Fix :

Srinivasa Reddy Jambalakidi Pamba movie Release on June 14

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ