Advertisementt

అదితిరావు హైద‌రీ టాలెంట్ చూపిస్తోంది..!

Thu 17th May 2018 09:15 AM
aditi rao hydari,dubbing,talent,sammohanam  అదితిరావు హైద‌రీ టాలెంట్ చూపిస్తోంది..!
Aditi Rao Hydari Dubbing for Sammohanam movie అదితిరావు హైద‌రీ టాలెంట్ చూపిస్తోంది..!
Advertisement
Ads by CJ

'స‌మ్మోహ‌నం' కోసం తన పాత్రకు తానే డ‌బ్బింగ్ చెబుతున్న అదితిరావు హైద‌రీ

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం 'స‌మ్మోహ‌నం'.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కుతోన్న 'స‌మ్మోహ‌నం' జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అదితీరావు హైద‌రి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకొంటున్నారు .   

నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. 'ఇంద్ర‌గంటి ఎప్పుడూ తెలుగుద‌నానికి ప్రాముఖ్య‌త‌నిస్తారు. దాదాపుగా  తెలుగమ్మాయిల‌నే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. ఆయ‌న ప్ర‌తి సినిమాలోనూ ఇదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్నారు. 'స‌మ్మోహ‌నం' నాయిక అదితిరావు హైద‌రి తెలుగు మూలాలున్న అమ్మాయి. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది. చాలా బాగా డ‌బ్బింగ్‌ చెబుతోంది. ఆ అమ్మాయి గొంతు కూడా చాలా బావుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన తొలి పాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. జూన్ 15న సినిమాను విడుద‌ల చేస్తాం' అని అన్నారు. 

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ ఉన్న నవతరం కథ 'స‌మ్మోహ‌నం'.  రొమాన్స్, హాస్యం స‌మ్మిళిత‌మై ఉంటాయి.  పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ, వివేక్ సాగ‌ర్ సంగీతం, రవీందర్ కళా దర్శకత్వం మెప్పిస్తాయి. మంచి క‌థ‌, క‌థ‌నానికి  చ‌క్క‌టి నిర్మాణ విలువ‌లు తోడ‌య్యాయి. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన ఫీల్ క్యారీ చేశాం.. అని చెప్పారు. 

న‌టీన‌టులు: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, డా .వీకే న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్, హర్షిణి, నందు, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌:  మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ:  పి.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, పాట‌లు: `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి, రామ‌జోగయ్య‌శాస్త్రి, నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

Aditi Rao Hydari Dubbing for Sammohanam movie:

Aditi Rao Hydari's Talent Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ