Advertisementt

'నేల టిక్కెట్టు' ఆడియో రిలీజ్ విశేషాలు..!

Sat 12th May 2018 03:35 PM
nela ticket,audio launch,pawan kalyan,raviteja,nela ticket audio release  'నేల టిక్కెట్టు' ఆడియో రిలీజ్ విశేషాలు..!
Nela Ticket Movie Audio Released 'నేల టిక్కెట్టు' ఆడియో రిలీజ్ విశేషాలు..!
Advertisement
Ads by CJ

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా రవితేజ హీరోగా  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం 'నేల టిక్కెట్టు'. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు. రామ్ తాళ్లూరి సోష‌ల్ స‌ర్వీస్‌లో భాగంగా 'నేల టిక్కెట్' చిత్రంలో ర‌వితేజ వాడిన క్యాష్‌ను దివ్యాంగుల‌కు ఇచ్చారు. ఎస్ ఓ ఎస్ సంస్థ‌కు రూ.ల‌క్ష‌ చెక్ అందించారు. ఎస్ ఓ ఎస్ ర‌వీంద్ర‌కుమార్ అందుకున్నారు.

జెమిని కిర‌ణ్ మాట్లాడుతూ.. మా చంటిగాడు లోక‌ల్ నేల టికెట్ అని వ‌స్తున్నాడు. ఇంక అంద‌రికీ జింతాతా జింతాతానే.. అని చెప్పారు. 

ద‌ర్శ‌కుడు ఆనంద్ మాట్లాడుతూ... ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. శక్తికాంత్ సంగీతం అందించిన పాటలు బావున్నాయి. నేల‌టికెట్ ఎలాంటి డౌట్ లేకుండా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత రామ్‌గారు చాలా పెద్ద ఎఫెర్ట్ పెట్టారు. క‌ల్యాణ్‌గారు చాలా సింపుల్ వ్య‌క్తి. ఆయ‌న కేర‌క్ట‌ర్ గురించి తెలిసిన వాడిగా నేను ఈ సినిమా హిట్ అవుతుంద‌ని చెబుతున్నాను. ర‌వితేజ‌గారి సినిమాను నేను థియేట‌ర్ల‌లో చూసిన‌ప్పుడు ఓ మేరేజ్ హాల్‌కి వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. ఆడియ‌న్స్ ఆయ‌న్ని హీరోలా కాకుండా, ఓ ఫ్యామిలీ మెంబ‌ర్‌లాగా చూసుకుంటార‌ని అర్థ‌మైంది.. అని చెప్పారు. 

చైత‌న్య పింగ‌ళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో రెండు పాట‌లు రాశాను. శ‌క్తికాంత్‌గారికి ధ‌న్య‌వాదాలు. క‌ల్యాణ్‌కృష్ణ‌గారి రారండోయ్ నాకు ఇష్టం. మా అబ్బాయి ర‌వితేజ‌గారికి ఫ్యాన్‌.. అని చెప్పారు.

మెహ‌ర్ ర‌మేశ్ మాట్లాడుతూ.. అభిమాన హీరోల సినిమాల‌ను నేల‌టిక్కెట్‌కి వెళ్లే చూడాలి. నాకు తెలిసిన హీరోల్లో సినిమా అంటే అంత అభిమానం ఉన్న హీరో ర‌వితేజ‌. నేల‌టికెట్ ర‌వితేజ‌కు చాలా పెద్ద హిట్ కావాలి.. అని అన్నారు.

ఎన్‌. శంక‌ర్ మాట్లాడుతూ.. క‌ల్యాణ్‌కృష్ణ నా మిత్రుడు. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలి. రామ్ ఈ సినిమాతో పెద్ద విజ‌యం సాధించా.. అని చెప్పారు. 

రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ.. నేల టిక్కెట్ అనే అనౌన్స్ మెంట్ విన‌గానే క‌ల్యాణ్‌కృష్ణ టైటిల్ బాగా పెట్టాడ‌నిపించింది. ర‌వితేజ‌గారు హీరో అన‌గానే ఆయ‌న‌కు చాలా బాగా న‌ప్పుతుంద‌నిపించింది. నేను మొద‌టిగా రాసిన పెద్ద తొలి సినిమా 'దుబాయ్ శీను'. క‌ల్యాణ్‌కృష్ణ గ‌త రెండు చిత్రాల్లోనూ ఈ పాట‌లు రాశాను. త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైన స‌బ్జెక్ట్ ఇది. ఈ సినిమాతో క‌ల్యాణ్ హ్యాట్రిక్ హిట్ సాధిస్తారు.. అని చెప్పారు. 

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ.. గ‌బ్బ‌ర్ సింగ్ అనే సినిమా వ‌ల్ల నాలో ఉన్న కుంగుబాటుత‌నం దూరంగా పోతుంటుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారిని చూస్తే నాకు హై వ‌స్తుంది. ఆయ‌న బాడీ లాంగ్వేజ్ నాకు న‌చ్చుతోంది. విజ‌య‌వాడ‌లో క‌ల్యాణ్‌గారు అంత ఎండ‌లో చ‌మ‌ట‌లు క‌క్కుతూ న‌డుస్తుంటే ఫ‌స్ట్ టైమ్ నాకు న‌చ్చ‌లేదు ఏసీ కేర‌వ్యాన్ నుంచి వెళ్లే షూటింగ్‌ల‌ను కాద‌నుకుని, అఖండ‌మైన కీర్తిని కాద‌నుకుని ఈయ‌న ఎందుకు వెళ్లిన‌ట్టు? ఇంత అవ‌స‌ర‌మా? ఇన్ని అవ‌మానాలు, ఇన్ని తిట్లు అవ‌స‌ర‌మా? అని కూడా అనిపించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు న‌మ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కోసం ఆయ‌న చేస్తున్న ప‌ని ఆహ్వానించ‌ద‌గిన‌దే. నేను, క‌ల్యాణ్ కొన్ని సినిమాల‌కు ర‌చ‌యిత‌లుగా ప‌నిచేశాం. ఈ సినిమా టీమ్‌కు పెద్ద విజ‌యం సాధించాలి.. అని చెప్పారు.

ర‌వి మాట్లాడుతూ.. రామ్ తాళ్లూరి, నేను ఒక‌టే కాలేజీలో చ‌దువుకున్నాం. అప్ప‌టి నుంచి ప‌రిచ‌యం. క‌ల్యాణ్ కృష్ణ‌, నేను పోసానిగారి ద‌గ్గ‌ర ప‌నిచేశాం. ర‌వితేజ నాకు ఆత్మీయులు. ఈ సినిమా టీమ్ మొత్తానికి అభినంద‌న‌లు. స‌త్యానంద్‌గారి స్క్రీన్‌ప్లే ఎప్పుడూ న‌మ్మ‌ద‌గ్గ‌దే.. అని చెప్పారు.

మాళ‌విక శ‌ర్మ మాట్లాడుతూ.. ఇవాళ ఈ వేదిక మీద నాకు చాలా బాధ‌గా ఉంది. ఇంత మంది ప్రేక్ష‌కుల మ‌ధ్య నేనెప్పుడూ నిల‌బడ‌లేదు. ఇంత మంది ముందు నిలుచుని మాట్లాడ‌టం మామూలు విష‌యం కాదు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి థాంక్యూ. నేను చాలా మామూలు అమ్మాయి. కానీ నా క‌ల మామూల్ది కాదు. ప్ర‌తి సారీ థియేట‌ర్‌కి వెళ్లిన‌ప్పుడు ఒక‌రోజు స్క్రీన్ మీద న‌న్ను నేను చూసుకుంటాన‌ని న‌మ్మాను. ఈ సినిమాతో అది నెర‌వేరింది. ర‌విగారు, క‌ల్యాణ్‌గారు, రామ్‌గారు నాకు రెక్క‌లిచ్చారు. నా క‌ల‌ల‌కు రెక్క‌లిచ్చారు. ఈ సినిమా చేయ‌డానికి ముందు నాకు నా మీద, నాన‌ట‌న మీద అంత న‌మ్మ‌కం ఉండేది కాదు. కానీ పాజిటివ్ ప‌ర్స‌న్‌గా ఎలా ఉండాలో క‌ల్యాణ్‌గారు నేర్పారు. రామ్‌గారు న‌న్ను నేను తెర‌మీద చూసుకునే అవ‌కాశం ఇచ్చారు. ర‌వితేజ చాలా ఎన‌ర్జిటిక్‌, ప్యాష‌నేట్‌, హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌. ఆయ‌న నాకు స్ఫూర్తి.. అని అన్నారు. 

సంగీత ద‌ర్శ‌కుడు శ‌క్తికాంత్ మాట్లాడుతూ.. క‌ల్యాణ్‌కృష్ణ‌గారి లాంటి ద‌ర్శ‌కుడితో ప‌నిచేయాల‌న్న‌ది నా క‌ల‌. ఈ చిత్రంతో అది నెర‌వేరింది.. అని అన్నారు.

డీఓపీ ముఖేష్ మాట్లాడుతూ..ఈ సినిమాకు ప‌నిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది..అని చెప్పారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ.. నేను ఎలాంటి పాత్ర‌లు చేసినా ప్రేక్ష‌కులు అభినందిస్తున్నారు. అలాంటి పాత్ర‌లు చేసి, చేసి అలాగే మారిపోతానేమోన‌ని అనిపిస్తోంది. నేను ద‌శాబ్దం క్రిత‌మే ప‌వ‌న్ వ్య‌క్తిత్వం అంటే ఇష్ట‌మ‌ని చిరంజీవిగారితో చెప్పాను. 'బ‌డ్జెట్ ప‌ద్మనాభం' సినిమా చేసేట‌ప్పుడు నేను హీరో, ర‌వి కేర‌క్ట‌ర్‌. ఆ సినిమాలో ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అదే ఫ్రెండ్లీనెస్ ఇప్ప‌టికీ ఉంది. మాస్‌, క్లాస్ అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ సినిమా రామ్‌గారు, ఆయ‌న భార్య ర‌జ‌నీగారి కోస‌మైనా హిట్ కావాలి.. అని అన్నారు.

రామ్ మాట్లాడుతూ.. ఒక‌సారి వెళ్లి అడ‌గ్గానే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు ఈ వేడుక‌కు వ‌చ్చారు. ర‌విగారు నాలో ఏం చూశారోగానీ, న‌న్ను పిలిచి సినిమా చేసుకోమ‌ని అన్నారు. ఆయ‌న ఒప్పుకొంటే ఇంకో నాలుగు సినిమాలు చేస్తా. క‌ల్యాణ్‌కృష్ణ‌గారు చాలా స‌పోర్ట్ చేశారు. మా ఆవిడ ర‌జ‌నీ చాలా స‌హ‌క‌రించారు. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.

క‌ల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ.. చుట్టూ జ‌నం మ‌ధ్య‌లో మ‌నం అనే మాటే ఈ సినిమా. అదే క్యాప్ష‌న్‌, అదే సోల్ ఈ సినిమాకు. నాకు చిన్నప్ప‌టి నుంచి ఎక్కువ మంది మ‌నుషుల‌తో ఉండ‌టం ఇష్టం. మా అమ్మానాన్న‌, మా అన్న‌య్య‌లు అంద‌రూ నాకు నేర్పించింది అదే. అదే ఈ సినిమాలో చెప్ప‌డానికి ట్రై చేశా. నాకు ఇలాంటి థాట్ వ‌చ్చేలా పెంచిన మా పేరెంట్స్ కి థాంక్స్. ఈ రోజు మా నాన్న పుట్టిన‌రోజు. ఈ సినిమాను ఆయ‌న‌కు అంకితం చేద్దామ‌ని ఉంది. కానీ ఇది నా ఒక్క‌డి క‌ష్టం మాత్ర‌మే కాదు. అందరిదీ. అందుకే నేను ఈ సినిమాకు ప‌డ్డ క‌ష్టాన్ని మా నాన్న‌కు అంకితం చేస్తున్నా. దేవుడు ఒక్కొక్క‌రికీ ఒక్కో రూపంలో క‌నిపిస్తారు. నాకు నాగార్జునగారి రూపంలో క‌నిపించారు. ఆయ‌న‌కు నాకు ఛాన్స్ ఇచ్చిన దేవుడులాంటి వ్య‌క్తి. అంత‌క‌న్నా ముందు నేను డైర‌క్ష‌న్ ట్రై చేస్తున్న స‌మ‌యంలో చాలా ట్ర‌య‌ల్స్ ఫెయిల్ అయ్యాయి. అలా ఒక సినిమా పూర్తిగా చేతి వ‌ర‌కు వ‌చ్చి జారిపోయింది. ఆ స‌మ‌యంలో నా ఫ్రెండ్ హ‌రీశ్ శంక‌ర్‌కి ఫోన్ చేసి క‌లుద్దామ‌ని అన్నాను. ఆ రోజు నేను చుట్టూ జ‌నం.. మ‌ధ్య‌లో మ‌నం అనే స‌బ్జెక్ట్ ని చెప్పాను. ఆ లైన్ విని హ‌రీశ్ శంక‌ర్ నాతో ర‌వితేజ‌కు  చెప్తావా అని అన్నారు. నేను వెళ్లి చెప్పాను. 'నేను ఇప్ప‌ట్లో చేయ‌లేను నాకు కొన్ని క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి. కానీ త‌ప్ప‌క చేస్తాను' అని అన్నారు. నేను మిగిలిన రోజులు మిగిలిన క‌థ‌ల‌తో ట్ర‌య‌ల్స్ వేయ‌డానికి నాకు బ‌లం ఇచ్చింది ఆయ‌న మాట‌లే. ఆ న‌మ్మ‌కాన్ని నేను మ‌ర్చిపోలేను. ఈ రోజు సినిమా చేసిన‌ప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఈ రోజు కూడా అంతే ఆనందంగా ఉన్నాను. స్క్రిప్ట్ త‌ర్వాత వింటాన‌ని చెప్పారు. షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి ఐదు రోజుల ముందు నేను నిర్మాత‌ల‌ను క‌లిశాను. వాళ్లు ర‌వితేజ‌గారి మీద ఉన్న న‌మ్మ‌కాన్ని నా మీద‌కు షిఫ్ట్ చేశారు. దేవుడు ఎవ‌రికైనా ప‌వ‌ర్ ఇస్తే వాళ్ల‌ను వాడుకోకుండా వ‌ద‌ల‌డు. టీ స్టాల్ పెడితే న‌లుగురికి, బిజినెస్ అంటే వెయ్యిమందికి, ప‌వర్‌స్టార్‌కి ఇచ్చిన ప‌వ‌ర్ చాలా ఎక్కువ‌. అందుకే ప‌వ‌ర్‌స్టార్ నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.. అని అన్నారు.

ర‌వితేజ మాట్లాడుతూ.. శ‌క్తికాంత్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మంచి సౌండింగ్‌, ఆర్కెస్ట్రా చేశాడు. నాకు తెలిసిన వాళ్ల‌లో హానెస్ట్ గా ఉండేవారు ఇద్ద‌రు. ఒక‌రు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఇంకొక‌రు జ‌గ‌ప‌తిబాబు. క‌ల్యాణ్‌గారు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను మ‌ర్చిపోలేను. ద‌శాబ్దం క్రితం ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారు నాతో ఫోన్‌లో 'మీరంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండీ' అని అడిగారు. ఆ కాంప్లిమెంట్‌ని మ‌ర్చిపోలేను.ఆయ‌న్ని చాలా సార్లు క‌లిసేవాడిని. ఇప్పుడు ఆయ‌న బిజీ అయిపోవ‌డం వ‌ల్ల క‌ల‌వ‌లేక‌పోతున్నాం. రామ్ తాళ్లూరి డ‌బ్బు సంపాదించి ప్యాష‌న్‌తో ఇక్క‌డికి వ‌చ్చారు. ఆయ‌న‌కు చాలా సినిమా పిచ్చి. ఆయ‌న‌తో ఈ జ‌ర్నీని కంటిన్యూ చేస్తాను. క‌ల్యాణ్ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. మ‌నిషి గోల‌గోల‌గా ఉంటాడు. విప‌రీత‌మైన స‌ర‌దాగా ఉంటాడు. సెట్లోనూ ఆడ‌వాళ్ల‌తో స‌ర‌దాగా ఉంటాడు. ఈ సినిమా ఆయ‌న‌కు హ్యాట్రిక్ కావాలి.. అని చెప్పారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ..ఈ సినిమాకు రావ‌డానికి ముఖ్య కార‌ణం నాకు ఎంతో ఇష్ట‌మైన ర‌వితేజ‌గారు. నేను యాక్ట‌ర్ కాక‌ముందు ఆయన్ని న‌టుడిగా చూశాను. ఎంతో ద‌గ్గ‌ర‌గా ఒక న‌టుడిని అలా చూడ‌టం అన్న‌య్య త‌ర్వాత ర‌వితేజ‌నే. ఆజ్‌కా గూండారాజ్  సినిమాను మ‌ద్రాసులో చూస్తున్న‌ప్పుడు తొలిసారి ర‌వితేజ‌ను క‌లిశాను. ఆయ‌న‌కు అది గుర్తుందో లేదో నాకు తెలియ‌దు . కానీ నేను మాత్రం గుర్తుంచుకున్నా. ర‌వితేజ న‌వ్వుల వెన‌కాల‌, ఆయ‌న న‌ట‌న వెనకాల చాలా త‌ప‌న‌, క‌ష్టం, కృషి, చెప్ప‌లేని క‌ష్టాల‌తో కూడిన బాధ‌లు ఉన్నాయి. ఒక వ్య‌క్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే గుండెల్లో ఎంతో కొంత బాధ‌లేక‌పోతే అది రాదు. అందుకే నాకు ర‌వితేజ‌గారంటే ఇష్టం. ఆయ‌న న‌టుడిగా ఎదుగుతున్న స్థాయి నుంచి నేను  చూశా. ఎక్క‌డా ఆత్మ‌విశ్వాసం స‌న్న‌గిల్ల‌కుండా త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. 'ఈయ‌నింత సిగ్గులేకుండా ఎలా యాక్ట్ చేస్తాడు' అని అనుకుంటా ఉంటా. నాకు సిగ్గు ఒదిలేసి యాక్ట్ చేయాలంటే పారిపోతా. ర‌వితేజ‌గారు మాత్రం సిగ్గ‌నే ప‌దాన్ని ఇంట్లో పెట్టేసి బ‌య‌టికొచ్చి పెర్ఫార్మెన్స్ చేయ‌గ‌ల‌రు. అందుకే నాకు ఇష్టం. నేల‌టికెట్ పెద్ద విజ‌యం సాధించాలి. హ్యాట్రిక్ కొట్టాలి. ఘ‌న విజ‌యం సాధించాలి. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికీ నా మ‌న‌స్ఫూర్తిగా శుభాకాంక్ష‌లు  చెబుతున్నా. నా స్నేహితుడు, నా మిత్రుడు రామ్ కోసం వ‌చ్చాను. ఖ‌మ్మం జిల్లాలో కొంత మందికి ఆర్థిక సాయం చేస్తుంటే అప్పుడు రామ్ గురించి తెలుసుకున్నా. డ‌బ్బు సంపాదించ‌డం కాదు, ఆ డ‌బ్బును స‌మాజానికి తిరిగి ఇవ్వాల‌నే ఆలోచ‌న ఉన్న వ్య‌క్తి రామ్‌. వాళ్లు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్లకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. మ‌న ప‌ని మాట్లాడాలే త‌ప్ప‌, మ‌నం కాద‌నే సిద్ధాంతం నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం సంగీత‌దర్శ‌కుడు శ‌క్తిగారు అలాంటి వ్య‌క్తి.. అని అన్నారు.

ఎడిట‌ర్ ఛోటా.కె.ప్ర‌సాద్‌, డీఓపీ ముఖేష్‌, సంగీత ద‌ర్శ‌కుడు శ‌క్తికాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

Nela Ticket Movie Audio Released :

>Nela Ticket Movie Audio Release Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ