Advertisementt

'శరభ' కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..!

Thu 10th May 2018 11:45 AM
sharabha,release date,jayapradha,sharabha press meet  'శరభ' కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..!
Sharabha Release Date Fix 'శరభ' కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..!
Advertisement
Ads by CJ

జూన్ 1న విడుదలవుతున్న 'శరభ' 

ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా.. సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శరభ'. ఈ చిత్రానికి ఎన్. నరసింహరావు దర్శకత్వం వహించగా అశ్విన్ కుమార్ సహదేవ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.  

ఈ సందర్భంగా నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. సోసియో ఫాంటసీగా రూపొందిన ఈచిత్రాన్ని జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నాము. జయప్రదగారు ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. త్వరలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా.. అన్నారు 

మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ... భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు నిర్మాత. అరుంధతి సినిమా తరువాత నాకు అంతటి స్పాన్ ఉన్న ఈ శరభ చిత్రం లభించింది. ఆర్ ఆర్ కు స్కోప్ ఎక్కువ ఉన్న సినిమా ఇది. పాటలు కూడా బాగొచ్చాయి.. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.. అన్నారు.

హీరో ఆకాష్ కుమార్ మాట్లాడుతూ.. అందరి కష్టమే ఈ శరభ చిత్రం. జయప్రద గారి లాంటి సీనియర్ నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. తెలుగులో ఇంత మంచి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది.. అన్నారు. 

జయప్రద మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తరువాత సినిమా చేయాలని ఆశ పుట్టింది అయితే ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నరసింహ ఈ చిత్ర కథతో వచ్చారు. కథ విన్నాక తెలిసింది తప్పకుండా విజయం పొందుతుందని అనిపించింది అందుకే అంగీకరించాను. చెప్పాలంటే ఈ చిత్రం నాకు మళ్లీ న్యూ ఎంట్రీలా అనిపిస్తోంది. నా రీఎంట్రీ కు ఓ మలుపు తిప్పే సినిమా అవుతుందని నమ్ముతున్నా. ఈ చిత్రంలో నా పాత్ర చాలా వెరీయేషన్స్ లో ఉంటుంది ఓ రకంగా నాకు ఛాలెంజింగ్ పాత్ర. ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తెలుగులో సినిమా చేస్తే తెలుగు బిడ్డని అనే అనుభూతి కలుగుతుంది నాకు. దైవానికి-దయ్యానికి మధ్య జరిగే సంఘర్షణే శరభ చిత్ర కథాంశం. పెద్ద స్టార్ కాస్టింగ్ తో చేసే సినిమాలా పెద్ద బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు నిర్మాత అశ్విన్ గారు. మంచి చిత్రంతో మంచి టీమ్ తో కలసి పనిచేయడం ఆనందంగా ఉంది.. అన్నారు. 

నాకు పెద్ద పరీక్షలా అనిపిస్తోంది.. నా రిజల్ట్ వచ్చేది జూన్ 1నాడే.. నన్ను పాస్ చేసేది ప్రేక్షకులే.. నన్ను నమ్మి నాకు అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతకు, జయప్రద గారికి నా ధన్యవాదాలు అని అన్నారు దర్శకుడు నరసింహరావు. 

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి, డా. జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్, మేకప్: నాయుడు మరియు శివ, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: రామ్- లక్ష్మణ్, డిజైనర్లు: అనిల్, భాను, కెమెరా: రమణ సాల్వ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆడియో గ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎ ఎస్., మ్యూజిక్: కోటి, నిర్మాత: అశ్విన్ కుమార్ సహదేవ్, రచన-దర్శకత్వం: నరసింహ రావు.

Sharabha Release Date Fix:

Sharabha Release Date Announcement PM Deatils

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ