రెగ్యులర్ షూటింగ్‌లో సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం
ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం ఉగాది పర్వదినాన హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్నది. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఈ నెల 4వ తేదీ నుంచి రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం. ఈ నెల 12 వరకు ఆర్‌ఎఫ్‌సీలో జరిగే ఈ షెడ్యూల్‌లో సుమంత్, ఈషారెబ్బా, జోష్వ్రి ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. తప్పకుండా చిత్ర సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది.. అని తెలిపారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్, స్టైలింగ్: సుష్మ త్రిపురాన, ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాతలు: ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.