Advertisementt

బ్యాంకాక్‌ వెళ్తున్న చ‌ర‌ణ్‌, బోయ‌పాటి!

Mon 07th May 2018 02:02 PM
ram charan,boyapati srinu,bangkok schedule,dvv daanayya  బ్యాంకాక్‌ వెళ్తున్న చ‌ర‌ణ్‌, బోయ‌పాటి!
Ram Charan and Boyapati Srinu Film Latest Update బ్యాంకాక్‌ వెళ్తున్న చ‌ర‌ణ్‌, బోయ‌పాటి!
Advertisement
Ads by CJ

మే 12 నుండి బ్యాంకాక్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి  శ్రీను చిత్రం

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి  హైద‌రాబాద్‌లో మేజ‌ర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ బ్యాంకాక్‌లో మే 12 నుండి జ‌ర‌గ‌నుంది. 

ఈ సంద‌ర్బంగా చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ.. మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా అంటే సినిమాపై ఎన్ని అంచ‌నాలుంటాయో అంద‌రికీ తెలిసిందే. ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. హైద‌రాబాద్‌లో మేజ‌ర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ స‌న్నివేశాల‌ను, అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. ఈ 20 రోజుల షెడ్యూల్‌లో రామ్ చరణ్, ప్ర‌శాంత్, స్నేహ‌, కియరా అద్వానిల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై సన్నివేశాల‌ను చిత్రీక‌రించారు.  అంత‌కు ముందు చిత్రీక‌రించిన 15 రోజుల షెడ్యూల్‌లో వివేక్ ఒబెరాయ్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై సన్నివేశాల‌ను చిత్రీక‌రించాం. త‌దుప‌రి షెడ్యూల్ కోసం యూనిట్ బ్యాంకాక్ వెళుతుంది. బ్యాంకాక్ షెడ్యూల్ 15 రోజుల పాటు ఉంటుంది.  మే 12 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది. మెగాభిమానులు, ప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం.. అన్నారు. 

రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్: జీవ‌న్‌, పి.ఆర్‌.ఓ : వ‌ంశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Ram Charan and Boyapati Srinu Film Latest Update :

Ram Charan and Boyapati Film bangkok schedule Starts From May 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ