Advertisementt

'మహానటి' కి క్లీన్ సర్టిఫికెట్..!

Sun 06th May 2018 03:56 PM
mahanati,censor,clean u,keerthi suresh,naga ashwin,savitri  'మహానటి' కి క్లీన్ సర్టిఫికెట్..!
Mahanati Censor Details 'మహానటి' కి క్లీన్ సర్టిఫికెట్..!
Advertisement
Ads by CJ

క్లీన్ 'యూ' సర్టిఫికెట్ తో సెన్సార్ వారి మెప్పు పొందిన 'మహానటి' 

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా మే 9 న భారీ విడుదలకు సిద్ధంగా ఉంది 'మహానటి'. సెన్సార్ వారు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహానటి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నత సాంకేతిక విలువలతో ప్రియాంక దత్ స్వప్న సినిమాస్ మరియు వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.

చిత్రంలో కీర్తి సురేష్ అచ్చు గుద్దినట్లు సావిత్రి గారిలా ఉండటం, టీజర్ మరియు పాటలకు విశేష స్పందన రావడంతో 'మహానటి' పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తుండగా సమంత, విజయ్ దేవరకొండలు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు, డా. రాజేంద్ర ప్రసాద్, మాళవిక నైర్, భానుప్రియ, షాలిని పాండే, దివ్య వాణి, శ్రీనివాస్ అవసరాల ఇతర ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్

Mahanati Censor Details:

Clean U Certificate to Mahanati

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ