Advertisementt

'నా పేరు సూర్య' సెట్స్ లో మెగాస్టార్ సందడి!!

Sun 15th Apr 2018 11:57 PM
chiranjeevi,allu arjun,naa peru surya,anu emmanuel,dancers  'నా పేరు సూర్య' సెట్స్ లో మెగాస్టార్ సందడి!!
Chiranjeevi Visits Allu Arjun NPS Sets 'నా పేరు సూర్య' సెట్స్ లో మెగాస్టార్ సందడి!!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ చిత్రం లోని సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియో లో వేసిన గ్రాండ్ సెట్లో జరుగుతోంది. ఈ సాంగ్ సెట్లో కి మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. బన్నీ డాన్స్ చేస్తున్నంత సేపు చిరు ఎంజాయ్ చేశారు. సాంగ్ తనకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్ తో కలిసి సినిమా విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు.  మెగాస్టార్ చిరంజివి గారితో పాటు గీతాఆర్ట్స్ అథినేత అల్లు అర‌వింద్ గారు కూడా విచ్చేశారు.

మరోవైపు బ్యూటిఫుల్ లవ్ అంటూ సాగే పాటను ఈ మధ్యే నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష శ్రీధర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సాంగ్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  ఈ నెల 22న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేస్తున్నారు. 29 న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Chiranjeevi Visits Allu Arjun NPS Sets:

Chiranjeevi at Naa Peru Surya Set

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ