Advertisementt

నాగార్జున మూవీ సాంగ్ లో నాగచైతన్య..!

Sat 14th Apr 2018 01:48 AM
nagarjuna,naga chaitanya,remix song,allari alludu,mythri movie makers,savyasachi  నాగార్జున మూవీ సాంగ్ లో నాగచైతన్య..!
Allari Alludu Super Hit Song Remix For Naga Chaitanya Savyasachi నాగార్జున మూవీ సాంగ్ లో నాగచైతన్య..!
Advertisement
Ads by CJ

నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన అల్లరి అల్లుడు చిత్రంలోని 'నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు' అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్ ను యువసామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం 'సవ్యసాచి'లో రీమిక్స్ చేస్తున్నాడు. 'శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. 'నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు' రీమిక్స్ లో చైతూతో ఓ అగ్ర కథానాయకి ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ వెర్షన్ ను కంపోజ్ చేసిన కీరవారి ఈ రీమిక్స్ వెర్షన్ కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. 

నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM), కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.

Allari Alludu Super Hit Song Remix For Naga Chaitanya Savyasachi:

Mythri Movie Makers decided to remix Nagarjuna’s super hit mass number Ninnu Roadu Meeda Chusinadi Laggayithu from blockbuster film Allari Alludu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ