Advertisementt

పవన్ 'తొలిప్రేమ'లానే ఉంటుందంట..!

Sat 07th Apr 2018 05:50 PM
sai dharam tej,karunakaran,ks rama rao,anupama parameswaran,on location  పవన్ 'తొలిప్రేమ'లానే ఉంటుందంట..!
Sai Dharam Tej and Karunakaran Movie On location Meet Updates పవన్ 'తొలిప్రేమ'లానే ఉంటుందంట..!
Advertisement
Ads by CJ

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్‌, కాంబినేష‌న్‌లో మూవీ క్యూట్‌.. బ్యూటీఫుల్‌..యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోంది - నిర్మాత కె.ఎస్‌.రామారావు 

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తోన్న చిత్రం  ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సార‌థి స్టూడియోలో వేసిన భారీ హౌస్ సెట్‌లో ప్ర‌ధాన తారాగ‌ణంపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సందర్భంగా లొకేష‌న్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..,

చిత్ర నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - సినిమా అద్భుతంగా వ‌స్తుంది. తేజు అనే పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు. నందిత అనే పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంతో క‌ష్ట‌డి సినిమా చేస్తున్నారు. ఈ నెల 11కంతా మేజ‌ర్ పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేస్తాం. అలాగే ఈ నెల 23 నుండి మూడు రోజుల పాటు క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తాం. మే 1 నుండి 6 వ‌ర‌కు ఫ్రాన్స్‌లో రెండు సాంగ్స్‌ను పూర్తి చేస్తాం. గోపీసుంద‌ర్ అద్భుత‌మైన సంగీతం అందించారు. డార్లింగ్ స్వామి మంచి మాట‌లు అందించారు. ఫ‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ కుద‌ర‌డం వ‌ల్ల‌నే సినిమాను అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేస్తాం. జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్ర లొకేశ్ హీరో పెద్దనాన్న‌, పెద్ద‌మ్మ పాత్ర‌ల్లో న‌టిస్తుంటే.. పృథ్వీ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఓ భారీ హౌస్ సెట్‌ను వేసి కుటుంబ సభ్యుల మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాం. ల‌వ్‌లీ, బ్యూటీఫుల్‌, యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా క‌రుణాక‌ర‌న్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే మంచి టైటిల్‌ను ప్రక‌టిస్తాం. సాయిధ‌ర‌మ్‌తేజ్ ఎంతో స‌పోర్ట్ అందిస్తున్నారు. త‌ను క్యారెక్ట‌ర్ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది..అన్నారు. 

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ -త్వ‌ర‌లోనే ఓ మంచి టైటిల్‌ను తెలియ‌జేస్తాం. ఊహించుకుని ఏదీ రాయ‌వ‌ద్ద‌ని కోరుకుంటున్నాను.. అన్నారు. 

చిత్ర దర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ - సినిమాను క్యూట్ అండ్ క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. నా `తొలిప్రేమ‌, ఉల్లాసంగా ఉత్సాహంగా` సినిమాల స్టైల్‌లోనే ఈ సినిమా ఉంటుంది.. అన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రా లోకేశ్‌, సురేఖా వాణి, సినిమాటోగ్రాఫ‌ర్ ఐ.అండ్రూస్‌, డార్లింగ్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జ‌య‌ప్రకాశ్‌, ప‌విత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హ‌ర్ష‌, జోష్ ర‌వి, అరుణ్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చ‌ంద్ర‌బోస్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, పోతుల ర‌వికిర‌ణ్, గోశాల రాంబాబు, స్టంట్స్:  వెంక‌ట్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: స‌తీశ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  మోహ‌న్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్: చ‌ల‌సాని రామారావు,   ఎడిట‌ర్: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్‌:  సాహి సురేశ్‌, సంగీతం:  గోపీ సుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: అండ్రూ.ఐ, మాటలు:  డార్లింగ్ స్వామి, స‌హ నిర్మాత‌: అలెగ్జాండ‌ర్ వ‌ల్ల‌భ‌, నిర్మాత‌:  కె.ఎస్‌.రామారావు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌. 

Sai Dharam Tej and Karunakaran Movie On location Meet Updates:

Sai Dharam Tej and Karunakaran Movie Latest Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ