తాజాగా విడుదలకు సిద్దమవుతున్న 'రంగస్థలం' చిత్రంలో 'జిగేల్‌రాణి' అనే పాటలో డిజె భామ పూజాహెగ్డే చిందులు వేసినసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆ ఒక్క పాటలో నర్తించినందుకు పూజాహెగ్డేకి ఏకంగా 50 లక్షలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం విడుదల కానున్న సమయంలో ఈ పాట ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ సాంగ్ ప్రోమో చూసి 83 ఏళ్ల తన బామ్మ హస్పిటల్‌లో చిందులు వేస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను పూజాహెగ్డే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ, గత కొన్నిరోజులుగా మా బామ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఈ చిత్రంలోని నా పాట 'జిగేల్‌రాణి' ప్రోమోవిడుదలైతే దానిని మా బామ్మ చూసింది. దాంతో ఆమెలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు ఉంది. పైకి లేచి ఈ పాటకు చిందులేస్తూ డ్యాన్స్ చేసింది... అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ పాటలో డిజె భామ నడుం ఒంపులు, రామ్‌చరణ్ ఊరమాస్ స్టెప్పులు ఆ బామ్మకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయని అర్ధమవుతున్నా కూడా కొందరు మాత్రం హాస్పిటల్‌లో బాగా లేక అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మని, ఆమె చేత డ్యాన్స్ చేయించి, ఈ విధంగా కూడా పబ్లిసిటీ చేయడం దారుణమని అంటున్నారు. ఇక ఇటీవలే 'హార్ట్ ఎటాక్' భామ ఆదాశర్మ తన బామ్మతో చేసిన స్టెప్స్ వీడియో వైరల్ అయింది. ఏది ఏమైనా ఈ బామ చిందులు ఈ సినిమాకి కొత్త ప్రమోషన్స్‌గా ఉపయోగపడతాయనే చెప్పవచ్చు. ఎంతైనా ఈ క్రెడిట్ మొత్తం సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌కే దక్కుతాయనడంలో సందేహం లేదు.