ఇద్దరు చంద్రుళ్లని కలుపుతోన్న బాలయ్య...!
Balakrishna Special Invitation For KCR And Chandrababu Naiduఎంతగా అనుకున్నా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు. ఏపీకి ముఖ్యమంత్రి కూడా. మరోవైపు ఆయన బావబావమరిది సెంటిమెంట్‌కి కూడా మంచి కలరింగ్ ఇస్తూ ఉంటాడు. నందమూరి బాలకృష్ణని ఎమ్మేల్యేనిచేశాడు. ఇక తాజాగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్‌ని తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మద్య ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లు నాడు ఓపెనింగ్ జరిపి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇక ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడం తో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం తేజ దర్శకత్వంలో రూపొందనుంది. ఇక తేజ ప్రస్తుతం వెంకటేష్, నారారోహిత్‌లతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ వినాయక్ దర్శకత్వంలో 'జైసింహ' ని నిర్మించిన సి.కళ్యాణ్‌తోనే మరో చిత్రం ఉండనుందని వార్తలు వచ్చాయి.
కానీ ఈ అనౌన్స్‌మెంట్ ఇప్పుడే చేయవద్దని బాలయ్య చెప్పినా కూడా సి.కళ్యాణ్ దీనిని అనౌన్స్ చేయడంతో బాలయ్య తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడని సమాచారం. ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అనుమానాలన్నింటికి చెక్ చెబుతూ దర్శకుడు తేజ తన ఫేస్‌బుక్ ద్వారా స్పందించాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఈనెల 29వ తేదీన ఉదయం 9.30 నిమిషాలకు హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణా స్టూడియోస్‌లో ప్రారంభంకానుందని ప్రకటించాడు. ఎన్టీఆర్ అభిమానులందరికీ స్వాగతం అంటూ ఈవేడుక గ్రాండ్‌గా జరగనున్నట్లు తెలిపాడు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకి బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది మంచి చాయిస్ అనే చెప్పాలి.ఇక ఈ బయోపిక్‌లోఎంతో పాత్రలకు అవకాశం ఉండటం, వారందరూ నిజజీవితంలోని వ్యక్తులే కాబట్టి వారి ఎంపిక విషయంలో తేజ బాలయ్యలు ఎంతో శ్రద్ద చూపిస్తున్నారు. ఇక గతంలో తన వందో చిత్రం విషయంలో విడివిడిగా కేసీఆర్, చంద్రబాబులను కలిపిన బాలయ్య ఈ ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ ద్వారా మరోసారి ఇద్దరు చంద్రుళ్లను ఒకేచోట ఒకే వేదికపై కలపనున్నాడు.
ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. కేసీఆర్‌కి చంద్రబాబు నాయుడుతో పలు విభేదాలు ఉన్నప్పటికీ ఆయనకు తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. అందుకోసమే ఆయన తన కుమారుడి పేరులో కె. తారకరామారావు అని పెట్టాడు.మరి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ చిత్రం కోసం ఒకే వేదికపైకి రానుండటం విశేషంగాచెప్పాలి...!
Balakrishna Special Invitation For KCR And Chandrababu Naidu






































