Advertisementt

'ఎఫ్ 2' హీరోలు వీళ్లే..!

Sun 25th Mar 2018 08:54 PM
f2 movie,varun tej,venkatesh,multi starer movie,anil ravipudi  'ఎఫ్ 2' హీరోలు వీళ్లే..!
Venkatesh and Varun Tej in F2 Movie 'ఎఫ్ 2' హీరోలు వీళ్లే..!
Advertisement
Ads by CJ

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్‌

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్నారు. 

'ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌' హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాకు 'ఎఫ్ 2' టైటిల్‌ను ఖ‌రారు చేశారు. 'ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్' ఉప‌శీర్షిక‌. మంచి మెసేజ్‌తో పాటు ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కించనున్నారు. జూలై నుండి సినిమా ప్రారంభమ‌వుతుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలిపారు.

Venkatesh and Varun Tej in F2 Movie:

F2 Movie Official Announcement Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ