అన్నం ఉడికిందా అని చూడ్డానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలని అంటారు. అలాగే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి పాటలకు వస్తున్న స్పందన చూస్తే చాలు. `ఆనందం` ఆ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన `ఆనందం` పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. సచిన్ వారియర్ బాణీలకు, వనమాలి సాహిత్యానికి యువత ఫిదా అయ్యారు. ఆన్‌లైన్‌లోనూ, రేడియోలోనూ `ఆనందం` పాటలు మళ్లీమళ్లీ వినిపిస్తున్నాయి. మలయాళంలో యూత్‌ఫుల్ కాలేజీ కథగా విడుదలైన `ఆనందం`చిత్రాన్ని అదే పేరుతో
సుఖీభవ మూవీస్ అధినేత ఎత్తరి గురురాజ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల ఆడియో విడుదల చేశారు. ఈ నెల 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మలయాళంలో బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలు వినిపించిన ఈ చిత్రానికి గణేశ్ రాజ్ దర్శకత్వం వహించారు. కేరళ టాప్ హీరో `ప్రేమమ్` ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే. తెలుగులో అనువాదమవుతోన్న `ఆనందం` చిత్రానికి వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు , రవి వర్మ చిలువూరి సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు సమర్పిస్తున్నారు.
`ఆనందం` గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ 'ముందుగా ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా మా `ఆనందం` తరఫున అందరికీ శుభాకాంక్షలు. కోటి విద్యలు కూటికోసమే అంటారు. కడుపునిండిన క్షణం ఎవరికైనా కలిగేది మానసిక ఆనందమేగా. అందుకే అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. మా `ఆనందం` విషయానికి వస్తే... ఇటీవల విడుదలైన పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పాటలన్నీ వినసొంపుగా, యూత్‌ఫుల్‌గా ఉన్నాయని సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కేరళలో టాప్ మ్యూజిక్ డైరక్టర్లలో ఒకరైన సచిన్ వారియర్ సమకూర్చిన స్వరాలను విన్నప్పుడే తప్పకుండా హిట్ అయ్యే పాటలనే నమ్మకం కుదిరింది. ఇప్పుడు మా నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఆయన స్వరాలకు వనమాలి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. `హ్యాపీడేస్` పాటల తరహాలోనే మా పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. యువతీయువకులు పదే పదే వింటున్నారు. ఆనందం` అనువాద పనులు దాదాపుగా పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ నెల 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇందులో ఎక్కడా మలయాళ సినిమా ఛాయలు కనిపించవు. కాలేజీ అనుభవాలు అనేవి ప్రపంచంలో ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. మనసు పొరల్లో పదిలంగా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి. ఆ జ్ఞాపకాల దొంతరలను తడిమే ప్రయత్నం చేస్తుంది మా సినిమా. చూసిన ప్రతి ఒక్కరికీ చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. ఒక ఇండస్ట్రియల్ టూర్ నాలుగు రోజులు జరిగితే అక్కడ మూడు ప్రేమ జంటల కథే మా సినిమా' అని అన్నారు.
తారాగణం: అరుణ్ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, సిద్ధి మహాజనకట్టి, అన్ను ఆంటోని, అనార్కళి మరికర్, నివిన్ పాల్, రెంజి ఫణిక్కర్ తదితరులు సాంకేతిక నిపుణులు: మాటలు: ఎం.రాజశేఖర రెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: సచిన్ వారియర్, కెమెరా: ఆనంద్. ఇ. చంద్రన్, సహ నిర్మాతలు :వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి , దర్శకత్వం: గణేశ్ రాజ్, సమర్పణ: ఆర్. సీతారామరాజు.