Advertisementt

ఏప్రిల్ 6న ప్రభుదేవా సినిమా రిలీజ్!

Sun 18th Mar 2018 03:51 PM
gulebakavali,prabhu deva,hansika,april 6,malkapuram siva kumar  ఏప్రిల్ 6న ప్రభుదేవా సినిమా రిలీజ్!
Gulebakavali Release Date Fixed ఏప్రిల్ 6న ప్రభుదేవా సినిమా రిలీజ్!
Advertisement
Ads by CJ

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. 

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటికి దగ్గరగా వుంటుంది. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది అని తెలిపారు. 

ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్. 

Gulebakavali Release Date Fixed:

Gulebakavali Release on April 6th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ