Advertisementt

శ్రీదేవి పాటతో చిత్రం ప్రారంభమైంది..!

Sat 17th Mar 2018 06:47 PM
sirimalle puvvaa,director,goutham m,sridevi movie song  శ్రీదేవి పాటతో చిత్రం ప్రారంభమైంది..!
Sirimalle Puvvaa movie Launched శ్రీదేవి పాటతో చిత్రం ప్రారంభమైంది..!
Advertisement
Ads by CJ

'సిరిమల్లె పువ్వా' చిత్రం ప్రారంభం..

ఎస్. ఎమ్. క్రియేషన్స్ పతాకంపై మమత, నరేంద్ర, షఫీ, ప్రియ ప్రధాన పాత్రధారులుగా గౌతమ్. ఎమ్ దర్శకత్వంలో లేడీ నిర్మాత కౌసర్ జహాన్ నిర్మిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం 'సిరిమల్లె పువ్వా'. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వెనుక బడిన తరగతుల కమీషన్ అధ్యక్షులు డాక్టర్ వకుళా భరణం కృష్ణ మోహనరావు, సుధాకర్ గోగికర్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ.. 'ఇదొక వెరైటీ చిత్రం. ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా మంచి కథ, కథనంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. పేరుకు తగినట్లుగానే.. సిరిమల్లె పువ్వంత స్వచ్ఛంగా ఈ సినిమా ఉంటుంది..' అన్నారు. 

నిర్మాత కౌసర్ జహాన్ మాట్లాడుతూ..  'గౌతమ్ గారు చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. మంచి మెసేజ్ వుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది..' అన్నారు. 

మమత, నరేంద్ర, షఫీ, ప్రియ, జి. పుల్లారావు, దీప్తి, వీరు, కుమార్, గౌతమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డి.ఓ.పి: సూర్య, ప్రభాకర్, ఫిరోజ్, ఎడిటర్: నందమూరి హరి, మ్యూజిక్: రామ్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్: వాసుదేవరావు, ప్రొడక్షన్ మేనేజర్: లక్ష్మణ్, ప్రొడ్యూసర్: శ్రీమతి కౌసర్ జహాన్, కథ-దర్శకత్వం: గౌతమ్. ఎమ్. ​​​​

Sirimalle Puvvaa movie Launched:

Movie Launched With Siridevi Movie Song Lyric 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ