నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా 'డ్రీమ్ బాయ్' చిత్రం ప్రారంభం
రాజేష్ కనపర్తి దర్శకత్వంలో, రేణుక నరేంద్ర నిర్మాతగా మాస్టర్ ఎన్ టి రామ్ చరణ్ సమర్పణలో సెవన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కనున్న చిత్రం 'డ్రీమ్ బాయ్'. తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, మరో నిర్మాత ఏం వి రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేష్ కనపర్తి మాట్లాడుతూ.. ఇదొక థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. ప్రేమతో నిండిన క్యూట్ స్టోరీ ఇది. అలాగే సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. కొత్త, పాత నటీనటులతో ఈ చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కించనున్నాం. ఆద్యంతం కామెడీతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది..అన్నారు.
చిత్ర నిర్మాత రేణుక నరేంద్ర మాట్లాడుతూ.. మా డైరెక్టర్ రాజేష్ చెప్పిన కథ ఎంతో నచ్చింది. ఈ చిత్రం మార్చ్ 12 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పొందు పరచనున్నాం. ఈ చిత్రం మాకు, మా బ్యానర్ కు మంచి నేమ్ తెస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు.
తేజ, హరిణి రెడ్డి, ధనరాజ్, రాకేష్, సుఖేష్ రెడ్డి, లడ్డు, గౌతమ్ రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నాని, సంగీతం: సుభాష్ ఆనంద్, కో డైరెక్టర్: రాధా కృష్ణ, నిర్మాత: రేణుక నరేంద్ర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ కనపర్తి.