Advertisementt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ ఫిక్స్..!

Mon 05th Mar 2018 11:35 PM
pooja hegde,jr ntr,trivikram srinivas,radhakrishna,heroine  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ ఫిక్స్..!
Pooja Hegde in NTR and Trivikram Film యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి హీరోయిన్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తోన్న చిత్రంలో పూజా హెగ్డే 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో  కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతోంది. 

NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రంను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ  చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ.. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. 

Pooja Hegde in NTR and Trivikram Film :

Pooja Hegde teams up with NTR Jr for upcoming film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ