ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raj Tharun Lover Movie Release Date Fix

రాజ్ త‌రుణ్ 'ల‌వ‌ర్‌'కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Raj Tharun Lover Movie Release Date Fix

జూన్ 14న హిట్ చిత్రాల నిర్మాత‌ దిల్‌రాజు, రాజ్ త‌రుణ్ ల 'ల‌వ‌ర్‌'

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులందరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 'ల‌వ‌ర్‌' సినిమాలో న‌టిస్తున్నారు. `అలా ఎలా?` వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ‌, వెంట‌నే సినిమా చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా హిట్ సినిమా తీయాల‌నే దృక్ప‌థంతో వెయిట్ చేసి మంచి క‌థను త‌యారు చేసుకున్నారు. 

మంచి క‌థ‌కు త‌గ్గట్లు టెస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు, యంగ్ హీరో రాజ్ త‌రుణ్ సినిమాకు చ‌క్క‌గా కుదిరారు. ఈ సినిమా ప్రేమ‌లోని కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా ప‌రిచయం అవుతున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.

Lover Movie Release Date Confirmed

lover movie
raj tharun
lover movie
dil raju