అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఓ వెడ్డింగ్ నిమిత్తం భర్త, చిన్న కూతురుతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. హార్ట్ ఎటాక్ తో మరణించారు. శ్రీదేవి మరణవార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. బాలనటిగా టాలీవుడ్లో సినీ కెరియర్ మొదలెట్టిన శ్రీదేవి.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించింది. తండ్రీ కొడుకులతో కలిసి నటించిన ఘనత కూడా ఆమెకి వుంది. టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన శ్రీదేవి, బాలీవుడ్ నటుడు బోనీ కపూర్ ని వివాహం చేసుకుని.. బాలీవుడ్ కే పరిమితమైంది. చిత్ర పరిశ్రమ ఆమె లేరు అనే వార్తని జీర్ణించుకోలేక పోతోంది.