Advertisementt

మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ల యుద్ధభూమి..!

Wed 21st Feb 2018 01:06 PM
mohan lal,allu sirish,movie,yuddha bhoomi  మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ల యుద్ధభూమి..!
Yuddha Bhoomi in dubbing Stage మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ల యుద్ధభూమి..!
Advertisement
Ads by CJ

1971 లో భార‌త స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా మ‌ల‌యాళంలో తెర‌కెక్కిన చిత్రం `1971 బియాండ్ బార్డ‌ర్స్`. మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. గ‌త ఏడాది మ‌ల‌యాళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్నిజాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్,  శ్రీ ల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై  ఏయ‌న్ బాలాజీ తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. ప్ర‌స్తుతం  అల్లు శిరీష్ డ‌బ్బింగ్ చెబుతున్నారు. త్వ‌ర‌లో డబ్బింగ్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ నెలాఖ‌రులో ఆడియో విడుద‌ల చేసి మార్చిలో సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఏయ‌న్ బాలాజి మాట్లాడుతూ... 'ఈ చిత్ర ద‌ర్శ‌కుడైన మేజ‌ర్ ర‌విగారు నిజ జీవితంలో కూడా మేజ‌ర్ కావ‌డం విశేషం. ఈయ‌న 1981లో ఆర్మీలో చేరి అనేక కీల‌క ఆప‌రేష‌న్స్ ని లీడ్ చేశారు. మేజ‌ర్ ర‌వి 2002 సంవ‌త్స‌రంలో మొద‌టిసారిగా మెగాఫోన్ ప‌ట్టి `పున‌ర్ జ‌ని` అనే మ‌ల‌యాళ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అప్ప‌టి నుండి ఆయ‌న త‌న‌కున్న దేశ‌భ‌క్తిని నిరూపిస్తూ తాను ఆర్మీలో ప‌ని చేసే స‌మ‌యంలో జ‌రిగిన ఆప‌రేష‌న్స్ కి సంబంధించిన కొన్ని య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఎన్నో చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మేజ‌ర్ ర‌వి ప్ర‌తి సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ  యువ‌తలో దేశ‌భ‌క్తిని క‌లిగిస్తూ విజ‌యం సాధించిన‌వే. ఇక ఈ చిత్ర క‌థ విష‌యానికొస్తే..1971 లో భారత్ -పాక్ బార్డ‌ర్ లో జ‌రిగే వార్ నేప‌థ్యంలో ఎమోష‌నల్ డ్రామాగా సినిమా రూపొందింది. ముఖ్య పాత్ర‌ల‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌, టాలీవుడ్ మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి త‌న‌యుడు అల్లు శిరీష్ న‌టించారు. ఈ చిత్రంలో మేజ‌ర్‌గా మోహ‌న్ లాల్, ఎన‌ర్జిటిక్ అండ్ యంగ్ డైన‌మిక్ సోల్జ‌ర్ గా అల్లు శిరీష్ క‌నిపిస్తారు. ఎక్క‌డా రాజీ పడ‌కుండా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. గ‌తంలో నేను త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల‌ను తెలుగులోకి అనువ‌దించాను. నేను రిలీజ్ చేసిన ప్ర‌తి చిత్రం విజయం సాధించిన‌దే. ఈ సినిమా కూడా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మకం ఉంది. ప్ర‌స్తుతం అల్లు శిరీష్ తో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి ఈ నెలాఖ‌రులో ఆడియో విడుద‌ల చేసి, మార్చి మొద‌టి వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతంః సిద్ధార్ద్ విపిన్‌;  డైలాగ్స్ః ఎమ్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి;  కెమెరాః సుజిత్ వాసుదేవ్‌;  నిర్మాతః ఏయ‌న్ బాలాజీ (సూప‌ర్ గుడ్ బాలాజీ);  ద‌ర్శ‌క‌త్వంః మేజ‌ర్ ర‌వి.

Yuddha Bhoomi in dubbing Stage:

Mohan Lal and allu sirish movie name is Yuddha Bhoomi  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ