Advertisementt

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో చిత్రం షురూ..!

Tue 20th Feb 2018 11:28 PM
bellamkonda sai srinivas,director,srinivas,vamsadhara creations,production no 1,movie  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో చిత్రం షురూ..!
Young hero Bellamkonda Sai Srinivas signed one more new film. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో చిత్రం షురూ..!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా యువ ప్రతిభాశాలి శ్రీనివాస్ దర్శకత్వంలో వంశధార క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ.. 'ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో మా బ్యానర్ ను ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 'దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్' లాంటి సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడు గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాగారిని ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ప్రకటిస్తాం. ఫిబ్రవరి 22న హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో మా ప్రొడక్షన్ నెం.1 ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం' అన్నారు. 

Young hero Bellamkonda Sai Srinivas signed one more new film.:

Bellamkonda Sai Srinivas, Debutant Director Srinivas, Vamsadhara Creations Production No 1 Movie Announcement  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ