సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేశ్ శ్రీ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి హరేశ్వర ప్రొడక్షన్స్ పై హరీష్ వట్టి కూటి దర్శకత్వంలో మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం 'శివకాశీపురం'. హీరోయిన్ గా ప్రియాంక శర్మ నటించింది. పవన్ శేష సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సోమవారం ఆదిత్య ఆడియో ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... సంగీత దర్శకుడు శ్రీ నా తొలి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అప్పటి నుంచి తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. వారి అబ్బాయి రాజేష్ శ్రీ చక్రవర్తి హీరోగా పరిచయం కావడం చాలా హ్యాపీ. భవిష్యత్ లో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా. సినిమాలోని పాటలు, ట్రైలర్ బావున్నాయి. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు.. అన్నారు.
వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. చక్రవర్తిగారి వల్ల నేను సంగీత దర్శకుడినయ్యాను. వారి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ హీరోగా పరిచయం అవడం ఎంతో సంతోషం. శ్రీ తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఎక్కడున్నా తన తనయుడిని దీవిస్తాడు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు.. అన్నారు.
ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టైటిల్ దగ్గర నుంచి పోస్టర్స్, పాటలు, ట్రైలర్ ఇలా ప్రతి ఒకటి ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ట్రైలర్ లో హీరో రాజేష్ పర్ఫార్మెన్స్ బాగుంది. తనకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా. పవన్ శేష పాటలు వినడానికి హాయిగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న దర్శకుడు హరీష్ కు , టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు.. అన్నారు.
సీనియర్ నటి అంజలి తనయుడు చిన్నారావు మాట్లాడుతూ.. నాకు సోదరుడు లాంటి వారు నిర్మాత పులిమామిడి మోహన్ బాబు. ఎంతో శ్రమించే వ్యక్తి. ప్యాషన్ తో సినిమా చేశాడు. పాటలు, ట్రైలర్ బావుంది. పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా మంచి పేరు తేవాలన్నారు.
హీరో మదర్ అరుణ మాట్లాడుతూ... టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.
సంగీత దర్శకుడు పవన్ శేష మాట్లాడుతూ.. 'బతుకుబాట' షార్ట్ ఫిలింతో నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసారు హరీష్ గారు. అప్పటి నుంచి మా ఇద్దరి ప్రయాణం ప్రారంభమైంది. గులాబీ, లవ్ స్టేట్స్ చిత్రాలకు సంగీతం అందించా. ఇది నాకు మూడవ సినిమా. నిర్మాత పులిమామిడి మోహన్ బాబు ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొత్తం నాలుగు పాటలున్నాయి ఈ చిత్రంలో. సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం. ఎస్. పి.బాలసుబ్రమణ్యంగారు మా సినిమాలో పాడిన అమ్మ పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. రాజేష్ గారు ఈ సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటారు.. అన్నారు .
హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ నేర్చుకుని సినిమా చేద్దామనుకుంటున్న తరుణంలో నిర్మాత పులిమామిడిగారు, దర్శకుడు హరీష్ గారు వచ్చి ఈ స్టోరీ చెప్పారు. హరీష్ గారు చాలా నేచరల్ గా సినిమా తీసారు. పాటలు కూడా బాగా కుదిరాయి. నా తదుపరి సినిమాకు బెస్ట్ డాన్స్ చేస్తాను... అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మోహన్ బాబు పులి మామిడి మాట్లాడుతూ.. మా బేనర్ లో ఇది తొలి సినిమా. మా టీమ్ అందరి సహకారంతో సినిమా అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం. చక్రవర్తి మనవడిని చిత్ర పరిశ్రమకు నేను పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పవన్ శేష పాటలు, హరీష్ దర్శకత్వం బాగా కుదిరింది. సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. సీనియర్ నటి అంజలి గారి తనయుడు చిన్నారావు గారి సమక్షంలో మా ఆడియో విడుదల చేయడం ఆనందంగా ఉంది. అంజలి అమ్మకు మా సినిమాను అంకితం చేస్తున్నాం... అన్నారు.
దర్శకుడు హరీష్ వట్టికూటి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సీటీలో ఇంగ్లీష్ ఇన్ స్టక్టర్ గా చేస్తూ, షార్ట్ ఫిలింస్ తీసుకుంటున్న నన్ను 'శివకాశీపురం' సినిమాతో దర్శకుడుగా మార్చారు మా నిర్మాత పులిమామిడి మోహన్ బాబు గారు. వారికి నా ధన్యవాదాలు. నేను చక్రవర్తిగారి మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్ ని. వారి మనవడిని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేయడం చాలా సంతోషం. రాజేష్ ఫస్ట్ టైమ్ అయినా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడులా చేశాడు. పవన్ శేష సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సైకలాజికల్ థ్రిల్లర్ కు టీనేజ్ లవ్ స్టోరీని మిక్స్ చేసి రూపొందించిన చిత్రమిది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంతో నేచరల్ గా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి.. అన్నారు.
చమ్మక్ చంద్ర, సూర్య, జబర్ దస్త్ రాము, దిల్ రమేష్, నవీన్ జబర్ దస్త్, లక్ష్మీ, రవీంద్ర, మాస్టర్ హరి, హరికృష్ణ పులిమామిడి , సత్య ప్రియ, రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్ శేష, ఎడిటింగ్: జియోజిథామన్, కెమెరాః జయా జి.రామిరెడ్డి, నిర్మాత: మోహన్ బాబు పులిమామిడి, రచన, దర్శకత్వం: హరీష్ వట్టికూటి.