Advertisementt

'నా పేరు సూర్య' ... హైదరాబాద్ ట్రీట్ ..!

Sun 11th Feb 2018 08:44 PM
allu arjun,naa peru surya naa illu india,claimax,shooting,hyderabad  'నా పేరు సూర్య' ... హైదరాబాద్ ట్రీట్ ..!
Naa Peru Surya Climax Shoot From Tomorrow 'నా పేరు సూర్య' ... హైదరాబాద్ ట్రీట్ ..!
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లో అల్లు అర్జున్ "నా పేరు సూర్య " భారీ క్లైమాక్స్ షూటింగ్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. సోమవారం నుంచి (12-02) హైదరాబాద్ లో భారీ షూటింగ్ కు ప్లాన్ చేశారు. ఇందులో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట 'లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో' అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా... ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. రేపటి నుంచి హైదరాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరించబోతున్నాం. ఈ క్లైమాక్స్ ను భారీస్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. 'లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో' అనే పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు. విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు. 

Naa Peru Surya Climax Shoot From Tomorrow:

Allu Arjun:Naa Peru Surya Naa Illu India Climax Shooting in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ