Advertisementt

రాఘవేంద్రరావు లాంచ్ చేసిన 'గున్న' లోగో..!

Sat 03rd Feb 2018 02:45 PM
raghavendra rao,director,launches,gunna,movie,logo  రాఘవేంద్రరావు లాంచ్ చేసిన 'గున్న' లోగో..!
Raghavendra Rao Launches Gunna Logo రాఘవేంద్రరావు లాంచ్ చేసిన 'గున్న' లోగో..!
Advertisement
Ads by CJ

కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘గున్న’ లోగో  ఆవిష్కరణ 

సాలగ్రామ్‌ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘గున్న’.  విప్లవ్‌.కె దర్శకత్వం వహిస్తున్నారు. నేపథ్యాన్ని, పాత్రల స్వభావాన్ని తెలిపేందుకు రూపొందించిన ప్రీ పోస్టర్‌ను, లోగోను సీనియర్‌ దర్శకుడు కె. రాఘవేంద్రరావు శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘లోగో డిజైన్‌ బావుంది. సినిమా చక్కని విజయాన్ని అందుకుని టీమ్‌కు మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలి’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘16 ఏళ్ల వయసులా నిత్య నూతనంగా ఆలోచించే రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా పోస్టర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. 

పసి వయసుకు, యుక్త వయసుకు మధ్య గున్న ప్రాయంలో ఉన్న కొందరు స్నేహితుల కథతో తెరకెక్కనున్న చిత్రమిది. సినిమాకు సంబంధించి ప్రధాన పాత్రల ఎంపిక ఎనిమిది నెలలుగా జరుగుతోంది. సామ్రాట్‌, ప్రజ్ఞాత, నిఖిల్‌, ఆర్మాన్‌, మెహక్‌, ఐశ్వర్యలను ఎంపిక చేశాం. త్వరలో మిగిలిన ఇద్దరు ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసి మార్చిలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. 

కేఎస్వీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్‌: సుధీర్‌, కాస్టింగ్‌ డైరెక్టర్‌: హర్ష ఉప్పలూరి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, పాటలు: డా.జివాగో, డిఓపి: భరణి.కె.ధరన్‌, ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణ నిర్వహణ, లైన్‌ ప్రొడ్యూసర్‌: సి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.బాబ్జీ, నిర్మాణం సాలగ్రామ్‌ సినిమా. 

Raghavendra Rao Launches Gunna Logo:

Gunna Movie Logo Launched By K R R

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ