Advertisementt

'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌' వచ్చేసింది!

Tue 30th Jan 2018 07:19 PM
chamak chamak cham song,intelligent movie,sai dharam tej,lavanya tripathi  'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌' వచ్చేసింది!
Intelligent Movie Chiru Song Released 'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌' వచ్చేసింది!
Advertisement
Ads by CJ

'ఇంటిలిజెంట్‌' సెకండ్ సాంగ్ 'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌...' రిలీజ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'.  సోమవారం ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ 'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌...' ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియా ట్రెండింగ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి 'కొండ‌వీటి దొంగ‌' చిత్రంలోని 'చ‌మకు చ‌మ‌కు చామ్‌' సాంగ్‌కు ఇది రీమేక్ సాంగ్‌. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హించారు. రీసెంట్ విడుద‌ల చేసిన ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే రీసెంట్‌గా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేసిన 'లెట్స్ డు..' సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. 

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృథ్వీ, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

Click Here For Song

Intelligent Movie Chiru Song Released:

>Intelligent Movie chamak chamak Cham Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ