Advertisementt

'ఇంటిలిజెంట్‌'ని ప్రశంసించిన బాలయ్య!!

Sun 28th Jan 2018 07:50 PM
balakrishna,best wishes,sai dharam tej,inttelligent,movie,teaser launch  'ఇంటిలిజెంట్‌'ని ప్రశంసించిన బాలయ్య!!
Balakrishna's Best Wishes to Sai Dharam Tej 'ఇంటిలిజెంట్‌'ని ప్రశంసించిన బాలయ్య!!
Advertisement
Ads by CJ

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం టీజర్‌ను నటసింహ నందమూరి బాలకృష్ణ శనివారం విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాత సి.కళ్యాణ్‌, రచయిత శివ ఆకుల పాల్గొన్నారు. సహనిర్మాతల్లో ఒకరైన సి.వి.రావు బొకేలతో స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో మా సి.కళ్యాణ్‌గారు వి.వి.వినాయక్‌ దర్శకత్వలో నిర్మిస్తున్న నాలుగో సినిమా ఇది. వినాయక్‌ కాంబినేషన్‌లో ఇంతకుముందు 'చెన్నకేశవరెడ్డి' సినిమా చేశాం. మన కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. సినిమా విషయంలో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌, కలుపుగోలుతనం, ఆర్టిస్టు నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి.వినాయక్‌. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ సినిమా టీజర్‌ని నా చేతుల మీదుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. ఎందుకంటే సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నా సొంత బేనర్‌తో సమానం. కళ్యాణ్‌గారు పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఇంకా సినిమా చేయాలి. ఈ సినిమా విషయానికి వస్తే వినాయక్‌, శివ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ సినిమా టీజర్‌ చాలా బాగుంది. మిస్టీరియస్‌గా వుంది. టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది. టైటిల్‌ కూడా చాలా బాగుంది. మెగా అభిమానులకు, ఇది నా బేనర్‌ కాబట్టి నా అభిమానులకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది. సినిమా ఘనవిజయం సాధిస్తుంది.. అన్నారు. 

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. మా నందమూరి అభిమానులకు, మెగాస్టార్‌ చిరంజీవిగారి ఫ్యామిలీ హీరో సాయిధరమ్‌తేజ్‌ అభిమానులకు, ప్రేక్షకులకు నమస్కారం. ఇదొక సెన్సేషన్‌. నాకు చాలా పెద్ద హిట్‌ ఇచ్చిన మా హీరో బాలకృష్ణగారు. అలాగే గురువుగారి 150వ సినిమాకి నిర్మాతనయ్యే అవకాశం ఆరోజు నాకు ఇచ్చారు. అది చాలా గ్రేట్‌. ఈ పొంగల్‌కి 'జైసింహా' పెద్ద హిట్‌ ఇచ్చారు. చాలా తక్కువ టైమ్‌లో రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి సక్సెస్‌ కొట్టాం. అవన్నీ ఒక ఎత్తయితే వినాయక్‌ నాన్నగారు కృష్ణ కోరిక వినయ్‌ నాతో ఒక సినిమా చెయ్యాలని. చెన్నకేశవరెడ్డి ఫస్ట్‌ ప్రొజెక్షన్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో జరుగుతోంది. అప్పుడు వినయ్‌ నాన్నగారితో విషయం చెపితే నాకు వదిలెయ్‌ నేను చూసుకుంటాను. ఇప్పుడు నాతో సినిమా చేయడం ద్వారా వినయ్‌ నా కోరికను నెరవేర్చాడు. తేజు ఈ సినిమా ఎంతో కష్టపడి చేశారు. మా తండ్రిగారు దాసరి నారాయణరావుగారి దీవెనలు, అన్నయ్య కృష్ణ దీవెనలు మాకు ఉంటాయి. వీటన్నింటిని మించి మా బాలయ్యబాబు మాకు ఆశీస్సులు అందించేందుకు రావడం.. నేను చాలా చాలా పెద్ద సెన్సేషన్‌ హిట్‌ కొట్టినట్టు భావిస్తున్నాను. టీజర్‌ రిలీజ్‌ చెయ్యవలిసిందిగా బాబుని అడగడానికి వెళ్ళినపుడు ఒక టైమ్‌ చెప్పి అప్పుడు టీజర్‌ రిలీజ్‌ చెయ్యండి, సినిమా సూపర్‌హిట్‌ అన్నారు. 2018 ప్రారంభంలో బాలకృష్ణగారు నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. ఫిబ్రవరిలో కూడా సూపర్‌హిట్‌ కొట్టి సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ వుందని నిరూపిస్తాను..అన్నారు. 

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ.. మేం అడగ్గానే బాలకృష్ణగారు రావడంతో ఈ సినిమా సూపర్‌హిట్‌ అయిపోయిందన్న ఫీలింగ్‌ వచ్చేసింది. మేమంతా ఆనందంతో ఉద్వేగంగా ఉన్నాం. యూనిట్‌లోని ప్రతి ఒక్కరి తరఫున బాలకృష్ణగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..అన్నారు. 

హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ముందుగా బాలకృష్ణగారికి థాంక్స్‌. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడంలో బాలకృష్ణగారు ముందుంటారని అందరూ అంటారు. మా సినిమాకి ఆశీస్సులు అందించడానికి రావడంతో మరోసారి అది ప్రూవ్‌ అయ్యింది.. అన్నారు. 

రచయిత శివ ఆకుల మాట్లాడుతూ...భారతం, భాగవతాలను అవపోసన పట్టిన మా నందమూరి బాలకృష్ణగారి చేతుల మీదుగా ఈ టీజర్‌ రిలీజ్‌ అవడం ఆనందంగా వుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమా కథ రూపొందించడం జరిగింది. సమస్యనైనా, సందేశాన్నయినా సరదాగా చెప్పాలని మా మామ వినాయక్‌ ఎప్పుడూ అంటూ వుంటారు. అలా ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో మా అన్న సి.కళ్యాణ్‌గారి బేనర్‌లో ఈ సినిమాకి కథ, మాటలు అందించడం నాకెంతో సంతృప్తిని కలిగించింది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది.. అన్నారు. 

ఫిబ్రవరి 4న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ 

'ఇంటిలిజెంట్‌' ప్రీ రిలీజ్‌ వేడుకను ఫిబ్రవరి 4న రాజమండ్రిలోని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ఘనంగా నిర్వహించనున్నారు. 

Balakrishna's Best Wishes to Sai Dharam Tej:

Balakrishna's Down to Earth Nature at Inttelligent Teaser Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ