Advertisementt

'ట‌చ్ చేసి చూడు' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Wed 24th Jan 2018 11:32 PM
  'ట‌చ్ చేసి చూడు' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Touch Chesi Choodu Release date fixed 'ట‌చ్ చేసి చూడు' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన చిత్రం 'టచ్ చేసి చూడు`. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్ర‌వ‌రి 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. 'ట‌చ్ చేసి చూడు' చిత్రం సెన్సార్ పూర్త‌య్యింది. సినిమాకు 'యు/ఎ' స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఈ వారంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం. ఇటీవ‌ల సోషల్ మీడియా ద్వారా విడుద‌ల చేసిన పాటలకు, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ర‌వితేజ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నార‌ని సర్వ‌త్రా అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజతో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుద‌ల‌వుతుంది. చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.. అని తెలిపారు.

Touch Chesi Choodu Release date fixed:

Touch Chesi Choodu Censor Completes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ