Advertisementt

నాని 'యుద్ధం' మొదలైంది..!

Mon 15th Jan 2018 01:12 AM
nani,krishnarjuna yudham,merlapaka gandhi,hero nani movie  నాని 'యుద్ధం' మొదలైంది..!
Nani Krishnarjuna Yudham First Look Released నాని 'యుద్ధం' మొదలైంది..!
Advertisement
Ads by CJ

నేచ‌ర‌ల్ స్టార్ నాని...స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న ఈ యువ క‌థానాయ‌కుడు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' నుండి రీసెంట్‌గా విడుద‌లైన 'ఎంసీఏ' వ‌ర‌కు ఎనిమిది వ‌రుస స‌క్సెస్‌ఫుల్ చిత్రాలతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు. ప్ర‌స్తుతం నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. విభిన్న‌మైన క్యారెక్ట‌రైజేష‌న్స్‌లో ఆక‌ట్టుకుంటున్న నాని ఈ సినిమాలో రెండు పాత్ర‌లు చేస్తుండ‌టం విశేషం. మ‌రి ఇందులో నాని లుక్స్ ఎలా ఉంటాయోన‌ని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రంలోని కృష్ణ పాత్ర‌లో నాని ఎలా ఉండ‌బోతున్నారనే దానికి సంబంధించిన లుక్ విడుద‌లైంది. 

క‌త్తుల‌ను త‌ల‌పిస్తున్న కోర‌మీసాలు..ప‌దునైన చూపులతో ప‌క్కా మాస్ యాంగిల్‌లో ఉన్న నాని లుక్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక  గాంధీ స‌రికొత్త స్టైల్లో నానిని తెర‌పై చూపిస్తున్నార‌ని అర్థమ‌వుతుంది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతాన్ని అందిస్తుండ‌గా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  స‌మ‌ర్ప‌ణ‌ : వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి, సంగీతం:  హిప్ హాప్ త‌మిళ‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌: సాహి సురేష్‌, నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక  గాంధీ.

Nani Krishnarjuna Yudham First Look Released:

Nani look in Krishnarjuna Yudham revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ