Advertisementt

'భాగమతి' ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది..!

Tue 09th Jan 2018 09:40 PM
anushka,bhagamathie movie,trailer,response,ashok  'భాగమతి' ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది..!
Superb Response to Bhagamatie Movie Trailer 'భాగమతి' ట్రైలర్ రెస్పాన్స్ అదిరింది..!
Advertisement
Ads by CJ

అనుష్క భాగమతి ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్... జనవరి 26న గ్రాండ్ రిలీజ్

'ఎవ్వడు పడితే వాడు రావడానికి ... ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల గొడ్డా...భాగమతి అడ్డా.... లెక్కలు తేలాలి... ఒక్కడ్ని పోనివ్వను....' అంటూ అనుష్క భాగమతి ట్రైలర్ లో చెప్పిన  హై పిచ్ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలో... భాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుందని ట్రైలర్ తో రుజువైంది. భాగమతి ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, యువి క్రియేషన్స్ నిర్మాణాత్మక విలువలు హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. అనుష్క గెటప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్నంతగా క్రేజ్ సంపాదించుకుందీ ట్రైలర్. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న భాగమతి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రమోద్ , వంశీ ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... బాహుబలి చిత్రంతో తన ఫేంను, క్రేజ్ ను మరింత పెంచుకొని సూపర్ ఫాంలో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రాన్ని మేం నిర్మిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం. ఈ చిత్ర ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ తో  అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్ర కథ అద్భుతంగా కుదిరింది. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అశోక్ అద్బుతంగా తెరకెక్కించాడు. అనుష్క పెర్ పార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుంది. భాగమతి కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న అత్యధిక థియేటర్లలో భాగమతి చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అని అన్నారు.

Click Here To See The Trailer

నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్

సంగీతం - ఎస్.ఎస్.తమన్

సినిమాటోగ్రాఫర్ - మథి

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్

ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్

నిర్మాతలు - వంశీ - ప్రమోద్

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

Superb Response to Bhagamatie Movie Trailer:

Anushka Bhagamathie Movie Trailer Released and Got Good Response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ