Advertisementt

ర‌వితేజ సినిమా షూటింగ్ మొదలైంది..!!

Sat 06th Jan 2018 02:35 PM
raviteja,kalyan krishna,regular shoot  ర‌వితేజ సినిమా షూటింగ్ మొదలైంది..!!
Raviteja and Kalyan Krishna Film Shooting Starts ర‌వితేజ సినిమా షూటింగ్ మొదలైంది..!!
Advertisement
Ads by CJ

'రాజా ది గ్రేట్' లాంటి గ్రాండ్ సక్సెస్ త‌రువాత మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ హీరోగా, 'సోగ్గాడే చిన్న‌నాయ‌న‌, రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి భారీ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ తాళ్ళూరి నిర్మాతగా తొలి చిత్రం తెర‌కెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. మాళవిక శర్మ హీరోయిన్ గా ఎంపికైంది. ముకేశ్ కెమెరామెన్. 

ఈ సంధ‌ర్బంగా నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. 'ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో మొద‌టి చిత్రంగా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ గారు హీరోగా, క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ఓ చిత్రాన్ని చేస్తున్నాము. మెద‌టి చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఈరోజు(శుక్రవారం) నుంచి ప్రారంభించాం. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడుగా చేసిన రెండు చిత్రాలు కూడా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్స్ తెర‌కెక్కించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో క‌ళ్యాణ్ గారి చిత్రాల‌కి ఓ ప్ర‌త్యేకత వుంది. అలాగే మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ గారి చిత్రం అంటే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌డు స‌క్స‌స్ లో వున్న వీరిద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం కావ‌డం... క్రేజీ కాంబినేష‌న్ గా ట్రేడ్ వ‌ర్లాల్లో బ‌జ్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. మాళవిక శర్మ ని హీరోయిన్ గా ఎంపిక చేశాం. ముకేశ్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం..' అని అన్నారు.

Raviteja and Kalyan Krishna Film Shooting Starts:

Raviteja New Film Regular Shooting Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ