Advertisementt

పార్ల‌మెంట్ స‌భ్యుల కోసం 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి'!

Sun 24th Dec 2017 08:32 PM
saptagiri llb,parliament members,special show,delhi,mp siva prasad  పార్ల‌మెంట్ స‌భ్యుల కోసం 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి'!
Saptagiri LLB Special Show for MPs పార్ల‌మెంట్ స‌భ్యుల కోసం 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి'!
Advertisement
Ads by CJ

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి'కి రీమేక్‌ ఇది. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్‌ నిర్మాత డా. రవికిరణ్‌ చరణ్‌ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, డా. శివప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 7న విడుద‌లైంది.

ఈ చిత్రాన్ని పార్లమెంట్ సభ్యుల కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. డా.ఎన్ శివ‌ప్ర‌సాద్‌తో పాటు, సుజనా చౌద‌రి, ముర‌ళీ మోహ‌న్‌, మాగంటి బాబు, గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్మోహ‌న్ నాయుడు, నిర్మాత డా.ర‌వికిర‌ణ్ త‌దిరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ చితంలో ఎం.పి. శివప్రసాద్ నటన చాలా బాగుందని ప్రశంసించారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన డా.రవికిరణ్ ని పార్ల‌మెంట్ స‌భ్యులు అభినందించారు. 

Saptagiri LLB Special Show for MPs:

Parliament Members Appreciated Saptagiri LLB Producer Dr Ravi Kirane

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ