Advertisementt

డిసెంబర్ 24న 'సింహం' విజయవాడ వస్తోంది!

Tue 19th Dec 2017 02:14 PM
jai simha,balakrishna,jai simha audio launch date,jai simha audio launch venue,vijayawada,vajra grounds  డిసెంబర్ 24న 'సింహం' విజయవాడ వస్తోంది!
Jai Simha Movie Audio Date and Venue Confirmed డిసెంబర్ 24న 'సింహం' విజయవాడ వస్తోంది!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జై సింహా' షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 12న విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ 'జై సింహా' ఆడియోను డిసెంబర్ 24న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. దుబాయ్ లో చిత్రీకరించిన పాటలతో షూటింగ్ పూర్తయ్యింది. చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను డిసెంబర్ 24న విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ లో భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. నందమూరి బాలకృష్ణ మరియు చిత్రబృంద సభ్యులందరూ ఈ వేడుకకు హాజరుకానున్నారు. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా 'జై సింహా' చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. సీకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నుండి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా భావిస్తున్నాం.. అన్నారు.

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

Jai Simha Movie Audio Date and Venue Confirmed:

Jai Simha Movie Audio Function at Vijayawada Vajra Grounds

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ