Advertisementt

సుధీర్‌బాబు కొత్త చిత్రం షూటింగ్ షురూ!

Tue 12th Dec 2017 07:52 PM
sudheer babu,mohan krishna indraganti,aditi rao hydari,movie  సుధీర్‌బాబు కొత్త చిత్రం షూటింగ్ షురూ!
Sudheer Babu New Movie Opening సుధీర్‌బాబు కొత్త చిత్రం షూటింగ్ షురూ!
Advertisement
Ads by CJ

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన 'జెంటిల్‌మేన్‌' ఎంత పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రోసారి క‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తున్న ఈ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం ఉద‌యం మొద‌లైంది. ఫ‌స్ట్ షాట్‌కు ప్రముఖ నటులు -రచయిత  త‌నికెళ్ల భ‌ర‌ణి క్లాప్‌కొట్టారు. నట దర్శకులు అవ‌స‌రాల శ్రీనివాస్ ఫ‌స్ట్ షాట్‌కు గౌరవ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ణిర‌త్నం 'చెలియా' సినిమాలో నాయిక‌గా న‌టించి అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.

నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ''ఈరోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టాం. ఈ నెల 23 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంది. జ‌న‌వ‌రి 2 నుంచి జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు, జ‌న‌వ‌రి 20 నుంచి ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే షూటింగ్ చేస్తాం. ఆ త‌ర్వాత జ‌రిగే షెడ్యూళ్ల‌ను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబైలో ప్లాన్ చేస్తున్నాం .షూటింగ్‌ మార్చితో పూర్త‌వుతుంది. మేలో సినిమా విడుద‌ల చేస్తాం'' అని చెప్పారు.

దర్శకుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే అనూహ్య‌మైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది'' అన్నారు.​

సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, రాహుల్ రామ‌కృష్ణ‌, హ‌రితేజ‌, ప‌విత్ర లోకేష్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ, అభ‌య్‌, హ‌ర్షిణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మేక‌ప్‌: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఎన్‌. మ‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: ఆర్‌.సెంథిల్‌, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

Sudheer Babu New Movie Opening:

Sudheer Babu and Mohan Krishna Indraganti film starts rolling

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ