Advertisementt

నితిన్ హీరో గా శ్రీనివాస కల్యాణం

Sat 25th Nov 2017 08:23 PM
srinivasa kalyanam movie,dil raju,nithiin  నితిన్ హీరో గా శ్రీనివాస కల్యాణం
Nithiin to Act in Srinivasa Kalyanam Movie నితిన్ హీరో గా శ్రీనివాస కల్యాణం
Advertisement
Ads by CJ

యువ కథానాయకుడు నితిన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ కొత్త సినిమా నిర్మించబోతోంది. ఈ చిత్రానికి "శ్రీనివాస కల్యాణం" అనే పేరు నిర్ణయించారు. 14 ఏళ్ల క్రితం దిల్ రాజు, నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'దిల్' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. అటువంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన శతమానంభవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయస్థాయిలో 'ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం' గా స్వర్ణకమలం అవార్డ్ అందుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 

2018 మార్చిలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్రావణ మాసంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె  మేయర్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియచేస్తామని యూనిట్ తెలియచేసింది.

Nithiin to Act in Srinivasa Kalyanam Movie:

Nithiin and Dil Raju to team up for Srinivasa Kalyanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ