వర్మ, నాగ్ మూవీ డీటైల్స్ వచ్చేశాయ్!

ఆర్జీవీ స్వీయ దర్శకత్వంలో నాగార్జున - నవంబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల 'శివ' సినిమా ఒక చెరగని సంతకం చేసింది. 'శివ' విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వనుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల 'రాజుగారి గది 2' ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.
రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. 'శివ' సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ 'కంపెనీ' బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొనున్న ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే రాంగోపాల్ వర్మ వెల్లడించనున్నారు.
King Nagarjuna and director Ram Gopal Varma's historical combo is all set to repeat soon.
Nagarjuna and RGV's Film from November 20







































