Advertisementt

'సోడా..గోళీసోడా' తాగుతూ వినండి హాయ్ గా!

Sat 07th Oct 2017 11:06 AM
soda goli soda movie,audio launched,aali,director malluri hari babu  'సోడా..గోళీసోడా' తాగుతూ వినండి హాయ్ గా!
Soda Goli Soda Movie Audio Launch 'సోడా..గోళీసోడా' తాగుతూ వినండి హాయ్ గా!
Advertisement
Ads by CJ

సోడా  గోళీసోడా ఆడియో విడుదల 

ఎస్ బి ఆర్ట్ క్రియేషన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం సోడా గోలీసోడా ని విజయవంతంగా చిత్రీకరణ పూర్తీ చేసుకుని నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నెల 5 వ తారీఖున రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆడియో విడుదల వీడుక ప్రముఖుల మధ్య  అంగరంగ వైభవంగా జరుపుకుంది. 

నందమూరి హరి కృష్ణ , రాజ్ కందుకూరి, నవీన్ చంద్ర , బెకం వేణుగోపాల్, ప్రసన్న కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. 

ముఖ్య అతిధిగా విచ్చేసిన  నందమూరి హరి కృష్ణ గారు మొదటి సీడీని విడుదల చేసి రాజ్ కందుకూరి గారికి అందించారు. తర్వాత అయన మాట్లాడుతూ  'ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. తర్వాత మాట్లాడుతూ  సోడా గోలి సోడా టైటిల్ చాల బాగుంది. ఇండస్ట్రీ బాగుండాలి అంటే చిన్న నిర్మాతలు బాగుండాలి. ఈ సినిమా నిర్మాతలు, సినిమా మీద మక్కువతో సోడా గోలిసోడా చిత్రాన్ని నిర్మించారు. హీరో మానస్ బాలనటుడిగా తన కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో అవార్డు లు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మీరు అందరు మానస్ ని అలాగే హీరోయిన్ నిత్యా ని కూడా ఆశీర్వదించాలి. దర్శకుడు ఒక తండ్రి అయితే నిర్మాత ఒక తల్లి నటీనటులు అందరు వారి పిల్లలు , ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలి అంటే ప్రజలు అందరు వారిని ఆశీర్వదించాలి. ఈ ఆడియో ని సూపర్ హిట్ చేయాలి. ఆడియో సూపర్ హిట్ అయితే సినిమా కూడా సక్సెస్ అవుతుంది'. 

నవీన్ చంద్ర మాట్లాడుతూ 'నా మొదటి సినిమా లో మానస్ విలన్ గ నటించాడు. మానస్ మంచి నటుడు, మంచిగ డాన్సు చేస్తాడు . ఇప్పుడు తన సినిమా సోడా గోలిసోడా ఆడియో విడుదలవుతుంది. మానస్ కి మరియు హీరోయిన్ నిత్యా కి అల్ ది బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అవాలని కోరుకుంటూ టీం అందరికి అల్ ది బెస్ట్'. 

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 'సోడా గోలి సోడా చాల పవర్ఫుల్ టైటిల్, అందరికి తెలిసిన పదం.మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏమో మంచి మంచి చిత్రాలు చేసాడు, నంది అవార్డు కూడా సంపాదించుకున్నాడు, ఇప్పుడు హీరో రాణిస్తున్నాడు. నందమూరి హరి కృష్ణ గారు వచ్చి ఆడియో విడుదల చేయడం చాల సంతోషం గా ఉంది. నందమూరి హరి కృష్ణ గారి ఆశీర్వాదం చాల పవర్ ఫుల్ . అయన బ్లెస్సింగ్ తో వారి ఇద్దరు కొడుకులు, ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మంచి స్థానం లో ఉన్నారు అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని నేను కోరుకుంటున్నాను' . 

సినిమా పేరు - సోడా గోళీసోడా ...... మొత్తం గ్యాసే 

బ్యానర్ : ఎస్ బి ఆర్ట్ క్రియేషన్స్ 

నిర్మాత : భువనగిరి సత్య సింధుజ 

దర్శకుడు  : మల్లూరి హరి బాబు 

హీరో : మానస్ 

హీరోయిన్ : నిత్యా నరేష్ 

2nd హీరోయిన్ : కారుణ్య 

కెమెరా : ముజీర్ మల్లిక్ 

మ్యూజిక్ : భరత్ మధుసూదనాన్ 

లిరిక్స్ : రెహ్మాన్ 

కోరియోగ్రఫీ : అమ్మ రాజశేఖర్ , కపిల్ 

ఇతర తారాగణం :

అలీ 

బ్రహ్మానందం 

కృష్ణ భగవాన్ 

హైపర్ అది 

షకలక శంకర్ 

ఆర్ పి 

గౌతమ్ రాజు 

ఆర్తి 

దుబాయ్ మోహన్ 

ఫిష్ వెంకట్ 

తోటపల్లి మాధవ్ 

అపూర్వ 

జయవని 

అనంత్ 

Soda Goli Soda Movie Audio Launch:

Soda Goli Soda Movie Director By Malluri Hari Babu,Producer Bhuvanagiri Satya Sindhuja and Hero,Heroine Maanas and Nitya Naresh. This Movie Audio launched yesterday.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ