సినియోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై దినేష్, మియా జార్జ్ ,రిత్విక నటించిన పెళ్లిరోజు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ 25న ప్రసాద్ లాబ్ లో జరుగుతుందని నిర్మాత సురేష్ బల్లా తెలిపారు. ఈ ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య విచేస్తున్నారని, సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షత వహిస్తారు . ప్రత్యేక అతిధిగా అలనాటి నటి జమున వస్తున్నారని ఆయన చెప్పారు. . శ్రీమతి జమున 1968లో పెళ్లిరోజు చిత్రంలో నటించారు . అందుకే మేము ఇప్పుడు ఆమెను ఆహ్వానిస్తున్నామని సురేష్ తెలిపారు. .
పెళ్లిరోజు ప్రతివారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజని, అది అందరికీ మరపురాని రోజుగా మిగిలి పోతుందని మరో నిర్మాత మృదుల చెప్పారు.
నేటి సమాజంలో పెళ్లి విషయంలో యువతి యువకులు ఎదుర్కొనే సమస్యలకు ఇది ప్రతి బింబముగా ఉంటుందని ఆమె తెలిపారు.
ఓకే మంచి సందేశాత్మక చిత్రంగా దీనిని మలిచాము ఆమె అన్నారు . ఇప్పటికే ఈ సినిమా పట్ల పలువురు ఆసక్తి కనపరుస్తున్నారని , పాటలు కూడా చాలా అర్థ వంతంగా వుంటాయని చెప్పారు.
దర్శకుడు నెల్సన్ వెంకటేశం మాట్లాడుతూ , ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది అన్నారు. .ఓకే మంచి సినిమా తీశానని తృప్తి తనకు వున్నదని చెప్పారు