Advertisementt

'జై లవ కుశ' సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!

Wed 13th Sep 2017 06:22 PM
jai lava kusa,jai lava kusa censor report,jr ntr,young tiger ntr  'జై లవ కుశ' సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!
Jai Lava Kusa Censor Report 'జై లవ కుశ' సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రానికి U / A 

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఖరారు చేసింది. 

ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో 'జై లవ కుశ' చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటలలో కోటికి పైగా వ్యూస్ ను 'జై లవ కుశ' ట్రైలర్ సంపాదించుకుంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.. అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.

కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  రాశీ ఖన్నా, నివేత థామస్ ఈ చిత్రంలో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్) 

Jai Lava Kusa Censor Report:

Jai Lava Kusa has completed its censor formalities today and it has received a U/A certificate from the board.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ