Advertisementt

'హాలీ హాలీ హాలిబి' అదిరింది మహేష్..!

Mon 04th Sep 2017 11:55 PM
spyder,hali hali song,rakul preet singh,mahesh babu,hali hali song lyrical video  'హాలీ హాలీ హాలిబి' అదిరింది మహేష్..!
Spyder 2nd Song Lyrical Video Hali Hali Released 'హాలీ హాలీ హాలిబి' అదిరింది మహేష్..!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ల 'స్పైడర్‌' రెండో పాట 'హాలీ హాలీ' విడుదల 

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రంలోని రెండో పాటను సోమవారం విడుదల చేశారు. 'ఏ పుచ్చకాయ.. పుచ్చకాయ.. నీ పెదవి తీపి నాకిచ్చుకోవే.. ఇచ్చుకోవే.. నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి.. నా గుండెకొచ్చి గుచ్చుకోవే.... హాలీ హాలీ.. ఏ హాలీ హాలీ హాలిబి..' అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పాట మేకింగ్‌ కూడా వుండడం విశేషం. 

ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట 'బూమ్‌ బూమ్‌'కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటలకు హేరిస్‌ జయరాజ్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాపై వున్న అంచనాలను మరింత పెంచుతున్నాయి. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌. 

Spyder 2nd Song Lyrical Video Hali Hali Released :

Mahesh Babu and Rakul Press Singh Hali Hali song from Spyder Sensation 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ