Advertisementt

హార్వే అయితే ఏంటి? నే USA పోతా!: నితిన్

Thu 31st Aug 2017 05:33 PM
nithiin,pawan kalyan,krishna chaitanya,usa  హార్వే అయితే ఏంటి? నే USA పోతా!: నితిన్
35 Days USA Sehedule for Nithiin and Krishna Chaitanya Film హార్వే అయితే ఏంటి? నే USA పోతా!: నితిన్
Advertisement
Ads by CJ

రేపటి నుంచి యు.ఎస్. లో 'నితిన్' చిత్రం షూటింగ్ 

ఒక వైపు హార్వే తుఫాన్ యు.ఎస్. ని చుట్టేస్తుంటే..మరో వైపు అక్కడే తన చిత్రం కోసం షూటింగ్ కి బయలు దేరుతున్నాడు నితిన్. యూత్ స్టార్ నితిన్, మేఘా ఆకాష్ జంటగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా కృష్ణ చైతన్య దర్శకత్వం లో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం విదితమే. మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు 'త్రివిక్రమ్' ఈ చిత్రానికి కథను అందించటం మరో విశేషం. 

ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో 5 రోజుల పాటు కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుకుంది. 

రేపటి (1-9-17) నుంచి ఈ చిత్రం యు.ఎస్. లో షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రేపటి నుంచి ఈ చిత్రం షూటింగ్  యు.ఎస్. లో దాధాపు 35 రోజుల పాటు జరుగుతుంది. పాటలు, సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ  జరుగుతాయి. విభిన్నమైన వినోదాత్మక కథతో రూపొందుతున్న చిత్రమిదని ఆయన తెలిపారు. 

నితిన్, మేఘా ఆకాష్, నరేష్, రావు రమేష్, లిజి, ప్రగతి, నర్రా శ్రీను, శ్రీనివాసరెడ్డి, మధు, పమ్మి సాయి ప్రధాన తారాగణం. 

కథ : త్రివిక్రమ్ ,కెమెరా: నటరాజ్ సుబ్రమణ్యన్, సంగీతం : తమన్ , కళ : రాజీవ్ నాయర్, ఎడిటింగ్: ఎస్.ఆర్..శేఖర్. 

సమర్పణ: నిఖిత రెడ్డి 

నిర్మాత: సుధాకర్ రెడ్డి 

స్క్రీన్ ప్లే -మాటలు-దర్శకత్వం: కృష్ణ చైతన్య 

35 Days USA Sehedule for Nithiin and Krishna Chaitanya Film:

Handsome young star Nithiin and director Krishna Chaitanya have teamed up together for a unique movie which has already completed a major first schedule in Hyderabad.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ